Advertisement

అగ్రస్థానంలో ముంబై ఇండియన్స్

By: chandrasekar Fri, 02 Oct 2020 3:53 PM

అగ్రస్థానంలో ముంబై ఇండియన్స్

IPL 2020 లో 13 మ్యాచ్‌లు ముగిశాయి. గురువారం రాత్రి జరిగిన 13వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థాన౦లో ఉంది. ఇప్పటి వరకు లీగ్‌లో 4 మ్యాచ్‌లు ఆడిన ముంబై రెండు మ్యాచ్‌లలో విజయం, రెండు మ్యాచ్‌లలో పరాజయం పాలైంది. నాలుగు పాయింట్లు, +1.0974 నెట్ రన్ రేట్ తో అగ్రస్థానానికి చేరుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో నిలవగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ చివరి స్థానం(8)లో కొనసాగుతోంది.

గురువారంనాటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆరో స్థానానికి పడిపోయింది. లీగ్‌లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు మూడు మ్యాచ్ ల్లో ఒడి పోగా ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. దీనితో జట్టు రెండు పాయింట్లు వచ్చాయి.

ఆరంజ్ కాప్;

అత్యధిక పరుగుల సాధించిన ఆటగాళ్లకు సంబంధించిన ఆరంజ్ క్యాప్ పట్టికలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు మయాంక్ అగర్వాల్ (246) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కేఎల్ రాహుల్ (239) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

పర్పుల్ కాప్;

అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్లకు సంబంధించి పర్పుల్ క్యాప్ పట్టికలో మొహ్మద్ షమి(8 వికెట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా రబడా(7) రెండో స్థానంలో ఉన్నాడు.

ఐపీఎల్ లీగ్‌లో 14వ మ్యాచ్‌లో ఇవాళ(అక్టోబర్ 2వ తేదీ) దుబాయ్ ఇంటర్నేషన్ క్రికెట్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది.

Tags :
|
|
|

Advertisement