Advertisement

  • చెన్నై సూపర్ కింగ్స్ ను చిత్తుగా ఓడించిన ముంబై ఇండియన్స్

చెన్నై సూపర్ కింగ్స్ ను చిత్తుగా ఓడించిన ముంబై ఇండియన్స్

By: chandrasekar Sat, 24 Oct 2020 09:29 AM

చెన్నై సూపర్ కింగ్స్ ను చిత్తుగా ఓడించిన ముంబై ఇండియన్స్


చెన్నై సూపర్ కింగ్స్ ను ముంబై ఇండియన్స్ చిత్తుగా ఓడించింది. అందువల్ల ప్లేఆఫ్ కలలు నెరవేరలేదు. ఐపీఎల్ 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ ఆశలకి ముంబయి అడ్డుపడింది. షార్జా వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు ఇషాన్ కిషన్ (68 నాటౌట్: 37 బంతుల్లో 6x4, 5x6), డికాక్ (46 నాటౌట్: 37 బంతుల్లో 5x4, 2x6) చెలరేగడంతో ముంబయి ఇండియన్స్ 10 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది.

రోహిత్ శర్మ ఈ మ్యాచ్ కు దూరం కావడంతో పోలార్డ్ బాధ్యతలు చేపట్టాడు. మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ని ట్రెంట్ బౌల్ట్ (4/18), జస్‌ప్రీత్ బుమ్రా (2/25), రాహుల్ చాహర్ (2/22) అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో 114/9కే పరిమితం చేశారు. ఆ టీమ్‌లో ఆరుగురు బ్యాట్స్‌మెన్‌లు సింగిల్ డిజిట్‌కే పరిమితమవగా శామ్ కరన్ (52: 47 బంతుల్లో 4x4, 2x6) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లేకుంటే వందలోపే స్కోర్ చేసి ఉండేవారు.

చెన్నై సూపర్ కింగ్స్ అనంతరం బౌలింగ్‌లోనూ నిరాశపరిచి 12.2 ఓవర్లు బౌలింగ్ చేసినా కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయింది. తాజా సీజన్‌లో 10వ మ్యాచ్‌ ఆడిన ముంబయికి ఇది ఏడో గెలుపుకాగా ఆ జట్టు 14 పాయింట్లతో పట్టికలో నెం.1 స్థానానికి మళ్లీ దూసుకెళ్లింది. ఇక 11వ మ్యాచ్‌ ఆడిన చెన్నై టీమ్ ఎనిమిదవ ఓటమితో ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. దీంతో చెన్నై అభిమానులు తీవ్ర నిరాశకు లోనైయ్యారు.

Tags :

Advertisement