Advertisement

బరిలోకి దిగేందుకు సిద్దమయిన హిట్ మ్యాన్

By: Sankar Tue, 27 Oct 2020 5:59 PM

బరిలోకి దిగేందుకు సిద్దమయిన హిట్ మ్యాన్


వచ్చే నెల చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న టీమిండియా జట్టును ఆదివారం బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేయగా, అందులో హిట్‌మ్యాచ్‌ రోహిత్‌ శర్మకు చోటు దక్కలేదు. మూడు ఫార్మాట్లలోనూ రోహిత్‌ను పరిగణలోకి తీసుకోలేకపోవడంతో అతని ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ కల్గించింది. ఆసీస్‌ పర్యటనకు అంత ఆగమేఘాలపై జట్టును ఎంపిక చేయాల్సిన అవసరం ఏముందనే ప్రశ్న తలెత్తింది..

అయితే మళ్లీ రోహిత్‌ బరిలోకి దిగడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. రేపు(బుధవారం) ఆర్సీబీతో జరుగనున్న మ్యాచ్‌లో రోహిత్‌ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తాజాగా రోహిత్‌ శర్మ ప్రాక్టీస్‌ చేస్తున్న విధానం అతని రాకను బలపరుస్తోంది. రోహిత్‌ శర్మ ఫుల్‌ స్వింగ్‌లో తన ప్రాక్టీస్‌ను ఆరంభించాడు. నెట్స్‌లో తీవ్రంగా బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తూ భారీ షాట్లతో అలరించాడు. ఈ మేరకు రోహిత్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోను ముంబై ఇండియన్స్‌ తన ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది..

ఇక తొడ కండరాల గాయంతో రోహిత్ శర్మ వరుసగా రెండు మ్యాచ్లకు దూరం అయ్యాడు ..ఈ రెండు మ్యాచ్ లకు పోలార్డ్ కెప్టెన్ గా వ్యవహరించగా ఒక మ్యాచ్ లో గెలిచినా ముంబై , మరొక మ్యాచ్ లో ఓటమి పాలు అయింది ..ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో తొలిస్థానం లో ఉంది ..

Tags :
|
|

Advertisement