Advertisement

  • ఆ ఇద్దరి వలన తొలి మ్యాచ్ లో ముంబై పటిష్టంగా అనిపిస్తుంది.. గౌతమ్ గంభీర్

ఆ ఇద్దరి వలన తొలి మ్యాచ్ లో ముంబై పటిష్టంగా అనిపిస్తుంది.. గౌతమ్ గంభీర్

By: Sankar Tue, 15 Sept 2020 5:00 PM

ఆ ఇద్దరి వలన తొలి మ్యాచ్ లో ముంబై పటిష్టంగా అనిపిస్తుంది.. గౌతమ్ గంభీర్


మరొక నాలుగు రోజుల్లో క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీయల్ పదమూడవ సీజన్ యూఏఈ లో ప్రారంభం కానుంది..ఎప్పటిలాగే గత ఏడాది ఫైనలిస్టులు అయిన ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ లో తలపడనున్నాయి..గత సీజన్లో లో ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ మీద పూర్తి ఆధిపత్యం చెలాయించింది..దీనితో ఈ సారి ఎలాగా అయినా తొలి మ్యాచ్ లో విజయం సాధించి గత ఏడాది ఫైనల్ ప్రభావానికి ప్రతీకారం తీర్చుకోవాలని చెన్నై భావిస్తుంది..

అయితే చెన్నై కన్నా ముంబై ఇండియన్స్ బలంగా కనిపిస్తోందని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ముంబై జట్టుకు తిరుగులేని ఆయుధం అవుతాడని గంభీర్ అంచనా వేశాడు. బౌల్ట్, బుమ్రా పేస్ బౌలింగ్ కాంబినేషన్‌ అద్భుతంగా ఉంటుందని.. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో వీరిద్దరూ మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేస్తారన్నాడు.

ముంబై తో జరిగే తొలి మ్యాచ్‌లో సురేశ్ రైనా జట్టులో లేకపోవడం చెన్నై సూపర్ కింగ్స్‌పై ప్రభావం చూపుతుందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. కొత్త బంతితో బౌల్ట్ కుడి చేతి వాటం బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడతాడన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ షేన్ వాట్సన్ అంతర్జాతీయ క్రికెట్ ఆడటం లేదని.. ఇతర టోర్నీల్లోనూ అతడు పెద్దగా ఆడిన దాఖల్లాలేని గౌతీ చెప్పాడు.

కొత్త బంతితో బుమ్రా, బౌల్ట్ ఎలా బౌలింగ్ చేస్తారోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని గంభీర్ చెప్పాడు. వీరిద్దరూ ప్రపంచ స్థాయి బౌలర్లంటూ కొనియాడారు. మూడో స్థానంలో బరిలో దిగే రైనా లేకపోవడం, వాట్సన్ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడకపోవడం చెన్నైకు పెద్ద ఛాలెంజ్ అని గంభీర్ చెప్పాడు. బుమ్రా, బౌల్ట్ బౌలింగ్‌ను అతడు ఎలా ఎదుర్కొంటాడో చూడాలన్నాడు

Tags :
|
|

Advertisement