Advertisement

  • మా విజయాలలో అతడి భాగస్వామ్యం చాలా పెద్దది ...ముంబై కెప్టెన్ రోహిత్

మా విజయాలలో అతడి భాగస్వామ్యం చాలా పెద్దది ...ముంబై కెప్టెన్ రోహిత్

By: Sankar Tue, 10 Nov 2020 1:32 PM

మా విజయాలలో అతడి భాగస్వామ్యం చాలా పెద్దది ...ముంబై కెప్టెన్ రోహిత్


ఏ ఏడాది ఐపీయల్ ఫైనల్ దశకు చేరుకుంది..ఇక ఎప్పటిలాగే డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ తమ బలాన్ని నిరూపించుకుంటూ మరొకసారి ఫైనల్ కు చేరుకుంది...ఇక ముంబై ప్రత్యర్థిగా యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ దూసుకువచ్చింది..అయితే మరొకటైటిల్‌ను ఎగురేసుకుపోవాలని రోహిత్‌ గ్యాంగ్‌ ఒకవైపు, తొలి టైటిల్‌ను ముద్దాడాలనే అయ్యర్‌ గ్యాంగ్‌ మరొకవైపు ఫైనల్‌ కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే ప్రిమ్యాచ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ప్రత్యేకంగా సూర్యకుమార్‌ యాదవ్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘సూర్యకుమార్‌ యాదవ్‌ మంచి ఆరంభాలు ఇస్తున్నాడు. ఈ సీజన్‌లో ఒక ప్రత్యేకమైన సూర్యకుమార్‌ను చూస్తున్నాం. అతని గేమ్‌ వేరే లెవెల్‌లో ఉంది. అది మనమంతా చూశాం.. అందుకు మనమే సాక్షులం. ఒక చక్కటి టెంపోతో ఆడుతున్నాడు. దాన్నే కొనసాగిస్తూ విలువైన పరుగులు చేస్తున్నాడు. మా విజయాల్లో సూర్యకుమార్‌ భాగస్వామ్యం చాలా పెద్దది’ అని పేర్కొన్నాడు.

ఢిల్లీతో జరిగిన క్వాలిఫయర్‌-1లో సూర్యకుమార్‌ యాదవ్‌ హాఫ్‌ సెంచరీ సాధించి ముంబై భారీ స్కోరు చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు. అదే సమయంలో ఈ సీజన్‌లో 450 పరుగులకు పైగా సాధించిన ఎనిమిది మంది ఆటగాళ్లలో సూర్యకుమార్‌ ఒకడు. ఇక వంద ఐపీఎల్‌ మ్యాచ్‌లు, రెండు వేలకు పైగా పరుగులు చేసిన తొలి అన్‌క్యాప్డ్‌ భారత క్రికెటర్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ గుర్తింపు పొందాడు.

Tags :

Advertisement