Advertisement

  • బౌలింగ్‌ మరియు బ్యాటింగ్‌లలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్

బౌలింగ్‌ మరియు బ్యాటింగ్‌లలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్

By: chandrasekar Sat, 17 Oct 2020 10:01 AM

బౌలింగ్‌ మరియు బ్యాటింగ్‌లలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్


బౌలింగ్‌ మరియు బ్యాటింగ్‌లలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ను ముంబై ఇండియన్స్ చిత్తు చేసింది. ఓపెనర్ క్వింటన్‌ డికాక్ రెచ్చిపోగా ముంబై సునాయాసంగా విజయాన్ని అందుకుంది. పీఎల్‌-13లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తూ వరుస విజయాలతో ప్రత్యర్థులకు సవాలు విసురుతోంది. లీగ్‌లో 8 మ్యాచ్‌లాడిన రోహిత్‌ సేన ఆరో గెలుపుతో ‘టాప్‌’లోకి వచ్చింది. శుక్రవారం జరిగిన పోరులో ముంబై ఇండియన్స్‌ 8 వికెట్లతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయాన్ని నమోదు చేసింది. 149 పరుగుల లక్ష్యాన్ని ముంబై 16.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్ ‌(78 నాటౌట్:‌ 44 బంతుల్లో 9ఫోర్లు, 3సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి జట్టుకు అద్భుత విజయాన్నందించాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(35: 36 బంతుల్లో 5ఫోర్లు, సిక్స్‌), హార్డిక్‌ పాండ్య(21 నాటౌట్:‌ 11బంతుల్లో 3ఫోర్లు, సిక్స్‌) రాణించారు. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో అదిరిపోయే ఆటతీరుతో ముంబై దుమ్మురేపింది. తొలుత బ్యాటింగ్‌లో దారుణ ప్రదర్శన చేసిన కోల్‌కతా ఛేదనలో బౌలర్లు ముంబై జోరును అడ్డుకోలేకపోయారు.

ముంబై ఇండియన్స్ బౌలర్లను ఎదుర్కొనలేక మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులే చేసింది. పాట్‌ కమిన్స్‌(53 నాటౌట్:‌ 36 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కమిన్స్‌ మెరుపు అర్ధసెంచరీకి తోడు కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌(39 నాటౌట్‌: 29 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) రాణించడంతో కోల్‌కతా గౌరవప్రదరమైన స్కోరు చేసింది.ముఖ్యంగా కమిన్స్‌ వీరవిహారం చేశాడు. ఆరో వికెట్‌కు కమిన్స్‌, మోర్గాన్‌ 87(56 బంతుల్లో) పరుగులు జోడించారు. 61/5తో పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టుకు వీరిద్దరూ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసి మెరుగైన స్కోరు అందించారు. రాహుల్‌ త్రిపాఠి(7), శుభ్‌మన్‌ గిల్‌(21), నితీశ్‌ రాణా(5), దినేశ్‌ కార్తీక్‌(4) దారుణంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్ల ధాటికి టాప్‌ ఆర్డర్‌ పెవిలియన్‌కు కుప్పకూలింది. కోల్‌కతా కెప్టెన్సీ లో మార్పు చేసిన విజయాన్ని అందుకోలేక పోయింది.

Tags :
|

Advertisement