Advertisement

  • ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ ..ఫైనల్లోకి దూసుకెళ్లిన రోహిత్ సేన

ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ ..ఫైనల్లోకి దూసుకెళ్లిన రోహిత్ సేన

By: Sankar Fri, 06 Nov 2020 06:08 AM

ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ ..ఫైనల్లోకి దూసుకెళ్లిన రోహిత్ సేన


ఐపీయల్ 2020 తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తూ చేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది..బ్యాటింగ్ , బౌలింగ్ ఈ ఏ విభాగంలో కూడా ఢిల్లీ జట్టు మెరుగయిన ప్రదర్శన చేయలేకపోయింది..మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది.ఇషాన్‌ కిషన్‌ (30 బంతుల్లో 55 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) సూర్య కుమార్‌ యాదవ్‌ (38 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా అర్ధసెంచరీలు సాధించారు.

ఆఖర్లో హార్దిక్‌ పాండ్యా (14 బంతుల్లో 37 నాటౌట్‌; 5 సిక్సర్లు) విధ్వంస రచన చేశాడు. వీరి ప్రతాపానికి అశ్విన్‌ (3/29) ప్రదర్శన చిన్నబోయింది. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులే చేయగలిగింది. స్టొయినిస్‌ (46 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్‌ పటేల్‌ (33 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. బుమ్రా (4/14) పొట్టి ఫార్మాట్‌లో ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు.

కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ బ్యాటింగ్‌ మొదలు పెట్టగానే కుదేలైంది. ఓపెనర్లు, వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ ఇలా టాపార్డర్‌ ఖాతానే తెరువకుండా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ వేసిన బౌల్ట్‌ రెండో బంతికి పృథ్వీ షా(0)ను, ఐదో బంతికి రహానే (0)ను డకౌట్‌ చేశాడు. 0కే 2 వికెట్లు కోల్పోయిన క్యాపిటల్స్‌ను బుమ్రా మరో దెబ్బ తీశాడు. ధావన్‌ (0)ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు.

పరుగు చేయకుండానే 3 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ ఒక్కసారిగా సాగిలపడిపోయింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (12) కూడా ఎక్కువసేపు నిలువకుండా బుమ్రానే పెవిలియన్‌ చేర్చాడు. రిషబ్‌ పంత్‌ (3)ను కృనాల్‌ పాండ్యా ఔట్‌ చేశాడు. దీంతో ఢిల్లీ 41 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది.ఆతర్వాత స్టయినిస్ , అక్షర్ అటల్ కొంతమేర రాణించినప్పటికీ అది ఏ మాత్రం సరిపోలేదు..ఈ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ ఎలిమినేటర్ వన్ లో విజయం సాధించిన వారిపై క్వాలిఫైయర్ 2 లో తలపడుతుంది


Tags :
|
|

Advertisement