Advertisement

  • గవాస్కర్ పుట్టినరోజు సందర్భంగా వాంఖడేలో తిరిగి రెండు సీట్లు కేటాయించిన ఏంసీఏ

గవాస్కర్ పుట్టినరోజు సందర్భంగా వాంఖడేలో తిరిగి రెండు సీట్లు కేటాయించిన ఏంసీఏ

By: Sankar Fri, 10 July 2020 4:58 PM

గవాస్కర్ పుట్టినరోజు సందర్భంగా వాంఖడేలో తిరిగి రెండు సీట్లు కేటాయించిన ఏంసీఏ

భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ పుట్టిన రోజు నేడు ..లిటిల్ మాస్టర్ గా పేరుపొందిన గవాస్కర్ తాను అదే రోజుల్లో దిగ్గజ ఆటగాళ్లలో ఒకడు ..టెస్ట్ క్రికెట్ లో పదివేల పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడు గవాస్కర్ ..అదే విధంగా అప్పటికి బ్రాడ్ మెన్ నెలకొల్పిన అత్యధిక సెంచరీల రికార్డును చెరిపేసి తన పేరిట 34 సెంచరీలతో సరికొత్త రికార్డు లికించుకున్నాడు ..అది సచిన్ టెండూల్కర్ బద్దలు కొట్టేదాకా అలాగే ఉంది ..భారత్ లో క్రికెట్ అంత్యంత క్రేజ్ తెచ్చుకోవడానికి గవాస్కర్ కూడా ఒక ముఖ్య కారణం ..

భారత్ తరఫున 125 టెస్టులాడిన సునీల్ గవాస్కర్ 51.12 సగటుతో 10,122 పరుగులు చేశాడు. ఇందులో 34 సెంచరీలు, 4 డబుల్ సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలూ ఉన్నాయి. ఇక 108 వన్డేలాడిన ఈ లిటిల్ మాస్టర్ 35.14 సగటుతో 3,092 పరుగులు చేశాడు. ఇందులో ఒక్క సెంచరీ మాత్రమే ఉంది.అయితే గవాస్కర్ పుట్టిన రోజు సందర్భంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ రెండు సీట్లను వాంఖడే స్టేడియంలో ప్రత్యేకంగా కేటాయించింది ..

వాస్తవానికి 1987లో అంతర్జాతీయ క్రికెట్‌కి సునీల్ గవాస్కర్ రిటైర్మెంట్ ప్రకటించగానే.. అతని గౌరవార్థం వాంఖడే స్టేడియంలోని గార్వారె పెవిలియన్‌లో రెండు సీట్లని కేటాయించారు. కానీ.. 2011 వన్డే ప్రపంచకప్‌కి భారత్ ఆతిథ్యం ఇవ్వగా.. ఫైనల్‌‌ని వాంఖడేలో ప్లాన్ చేయడంతో.. స్టేడియంలో మార్పులు చేశారు. దాంతో.. అప్పట్లో ఆ రెండు సీట్లు కనుమరుగైపోగా.. ఎంసీఏ కూడా పట్టించుకోలేదు. కానీ.. తాజాగా సన్నీ పుట్టినరోజు సందర్భంగా తిరిగి ఆ రెండు సీట్లనీ.. అదీ ప్రెసిడెంట్స్ బాక్స్‌లో ఎంసీఏ కేటాయించింది.

Tags :
|
|
|

Advertisement