Advertisement

  • జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ పై అత్యాచార ఆరోపణలు...

జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ పై అత్యాచార ఆరోపణలు...

By: Sankar Wed, 23 Dec 2020 5:45 PM

జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ పై అత్యాచార ఆరోపణలు...


ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ పై అత్యాచార ఆరోపణలు విల్లువెత్తుతున్నాయి. గతంలో ఆయన ఓ మోడల్ పై అత్యాచారానికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ కేసు ఇప్పటిది కాదు. కానీ, ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు ట్రెండ్ అవుతున్నాయి.

ముంబై కి చెందిన మోడల్ రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నది. ఈ లేఖపై జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందివ్వాలని మహారాష్ట్ర డీజీపీని జాతీయ మహిళా కమిషన్ కోరింది.

ఝార్ఖండ్ సీఎంపై వచ్చిన ఈ ఆరోపణలు ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. సీఎం వెంటనే దిగిపోవాలని ఝార్ఖండ్ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు... ఏడేళ్ల క్రితం జరిగిన ఈ కేసు ఒక్కసారిగా మరలా వెలుగులోకి రావడం, అప్పటి లెటర్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ కావడంతో ఝార్ఖండ్ సీఎంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎంగా తప్పుకోవాలనే డిమాండ్ పెరిగిపోతున్నది

Tags :
|
|

Advertisement