Advertisement

  • ముఖేష్ అంబానీ వార్షిక జీతం రూ.15 కోట్లు మాత్రమే

ముఖేష్ అంబానీ వార్షిక జీతం రూ.15 కోట్లు మాత్రమే

By: chandrasekar Thu, 25 June 2020 12:58 PM

ముఖేష్ అంబానీ వార్షిక జీతం రూ.15 కోట్లు మాత్రమే


ముఖేష్ అంబానీ తమ ఇండస్ట్రీస్ నుంచి వార్షిక జీతం 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ .15 కోట్లు మాత్రమే తీసుకున్నారు. ఆయన గత 12 సంవత్సరాలుగా అదే స్థాయిలో జీతం తీసుకుంటున్నారు. కరోనా ను దృష్టిలో ఉంచుకుని ఈ ఆర్థిక సంవత్సరంలో జీతం తీసుకోకూడదని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండి ముఖేష్ అంబానీ నిర్ణయించుకున్నారు. ముఖేష్ అంబానీ 2008-09 నుండి ఏటా రూ .15 కోట్ల చొప్పున తన జీతం, వేతన భత్యం, కమీషన్‌తో కలిపి పొందుతున్నారు.

ఆయన ఇప్పటివరకు ఏటా రూ .24 కోట్ల చొప్పున కంపెనీకి తన వేతనం ద్వారా మిగిల్చారు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ పూర్తికాల డైరెక్టర్లందరికీ వేతనం బాగా పెరిగింది. అయినప్పటికీ, ముఖేష్ అంబానీ కంపెనీ అభివృద్ధి రీత్యా వేతన పెంపును స్వీకరించలేదు. ఇదిలా ఉంటే కరోనా దేశంపై భారీ సామాజిక, ఆర్థిక ప్రభావాన్ని చూపిందని ఆర్ఐఎల్ 2019-20 తన వార్షిక నివేదికలో పేర్కొంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ముఖేష్ అంబానీ తన జీతం వదిలివేసుకొని సంస్థకు ఇతోధికంగా సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు.

సంస్థలోని చాలా మంది ఉద్యోగుల జీతాన్ని 10-50 శాతం తగ్గించాలని నిర్ణయించినప్పుడు, ఏప్రిల్ చివరిలో అంబానీ తన జీతం పూర్తిగా వదిలివేయాలని నిర్ణయించుకున్నారు. ఇతర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కూడా తమ వేతనాలను 50 శాతం వరకు వదిలివేయాలని నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. ముఖేష్ అంబానీ 2019-20 ఆర్థిక సంవత్సరానికి వేతనం, ఇతర భత్యాలు కలిపి 4.36 కోట్లు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆయనకు రూ .4.45 కోట్ల జీతం, భత్యం లభించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కమీషన్ మొత్తం రూ .9.53 కోట్లుగా ఉండగా, perquisites రూ .31 లక్షల నుంచి రూ .40 లక్షలకు పెరిగింది. పదవీ విరమణ ప్రయోజనంగా రూ .71 లక్షలు అందుకున్నారు.

Tags :
|
|

Advertisement