Advertisement

అపర కుబేరుల జాబితాలో టాప్ టెన్ లో ముకేశ్ అంబానీ

By: Sankar Sun, 21 June 2020 4:54 PM

అపర కుబేరుల జాబితాలో టాప్ టెన్ లో ముకేశ్ అంబానీ



రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరొక అరుదయిన ఘనతను సాధించాడు ..ప్రపంచ అత్యంత ధనవంతుల జాబితాలో తొలిసారి టాప్ టెన్లోకి ప్రవేశించాడు ..బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచంలోని టాప్ 10 సంపన్నుల జాబితాలో ఇప్పుడు ముకేశ్ అంబానీ కూడా చేరారు. ఈయన ఫ్రాంకోయిజ్ బెటెన్‌కోర్ట్ మేయర్స్‌ను వెనక్కి నెట్టి టాప్ 10లోకి దూసుకెళ్లారు. ఈయన 9వ స్థానాన్ని ఆక్రమించారు. ఇలా టాప్ టెన్ లోకి రావడం అంబానీకి ఇదే తొలిసారి ..ఇక ఆసియాలో అత్యంత సంపన్నుల జాబితాలో తొలి స్థానాన్ని ఆక్రమించాడు ..చైనా అలీబాబా కంపెనీ చైర్మన్ జాక్ మా ప్రపంచ అత్యంత ధనవంతుల జాబితాలో 20 వస్థానలో ఉన్నాడు ..

కాగా ముకేశ్ అంబానీకి రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో 42 శాతం వాటాఉంది. ఇటీవల ఆర్‌ఐఎల్‌కు చెందిన రిలయన్స్ జియో ఫ్లాట్‌ఫామ్‌లోకి పెట్టుబడుల వరద కొనసాగింది. దీంతో ఆర్‌ఐఎల్ షేరు ధర కొత్త గరిష్ట స్థాయిలకు (రూ.1788) చేరింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.11 లక్షల కోట్లకు పైకి చేరింది. ఈ ఘనత సాధించిన తొలి దేశీ కంపెనీ ఇదే కావడం గమనార్హం. దీంతో ముకేశ్ అంబానీ సంపద కూడా బాగా పెరిగింది.ఇటీవల కాలంలో రిలయన్స్ జియోలో ఫేస్బుక్ , కేకేఆర్ , సిల్వర్ లేక్ పార్టనర్స్ , ముబాధల , ది అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ , జనరల్ అట్లాంటిక్ వంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి దీనితో ముకేశ్ అంబానీ ఆస్థి విలువ పెరిగింది ..

ఇక తొలి స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఉండగా , బిల్ గేట్స్ , మార్క్ జుకెన్బెర్గ్ , వారెన్ బఫెట్ , లారీ పేజ్ వంటి అగ్ర పారిశ్రామికవేత్తలు టాప్ టెన్ ఉన్నారు..




Tags :

Advertisement