Advertisement

  • త్వరలోనే ఆ డైనమైట్ ఆటగాడిని జాతీయ జట్టులో చూసే అవకాశం ఉంది ..ఎమ్యెస్కె ప్రసాద్

త్వరలోనే ఆ డైనమైట్ ఆటగాడిని జాతీయ జట్టులో చూసే అవకాశం ఉంది ..ఎమ్యెస్కె ప్రసాద్

By: Sankar Sun, 15 Nov 2020 05:59 AM

త్వరలోనే ఆ డైనమైట్ ఆటగాడిని జాతీయ జట్టులో చూసే అవకాశం ఉంది ..ఎమ్యెస్కె ప్రసాద్


ఐపీఎల్‌-2020 సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ముంబై ఇండియన్స్‌ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌పై టీమిండియా మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్‌ఎస్‌కే ప్రసాద్‌ ప్రశంసల వర్షం కురిపించాడు...

ఎమ్‌ఎస్‌కే ప్రసాద్‌ ఇషాన్‌ గురించి ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించాడు. డైనమైట్‌లా దూసుకువచ్చిన అతడిని చూస్తే ముచ్చటేసింది. ఓపెనింగ్‌ ఇన్నింగ్స్‌తో పాటు నంబర్‌ 4 ప్లేస్‌లోనూ బ్యాట్స్‌మెన్‌గానూ ఆకట్టుకున్నాడు. జట్టు అవసరాలకు అనుగుణంగా తనను తాను మలచుకోవడం చూస్తుంటే త్వరలోనే జాతీయ జట్టులో చోటు సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి

టీ20, వన్డేల్లో వికెట్‌కీపర్‌- బ్యాట్స్‌మెన్‌ స్థానానికి అతడో గట్టి పోటీదారు అవుతాడు. ఐపీఎల్‌ మాదిరి ప్రదర్శన కొనసాగిస్తే నేషనల్‌ స్వ్యాడ్‌లోకి అతడికి స్వాగతం లభిస్తుంది’’అని పేర్కొన్నాడు. కాగా టీమిండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ సైతం ఇషాన్‌ కిషన్‌పై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తన కెప్టెన్సీలో అండర్‌ 19 మ్యాచ్‌లు ఆడిన రిషభ్‌ పంత్‌తో ఇషాన్‌ కిషన్‌కు పోటీ ఆసక్తికరంగా ఉంటుందని, కొన్నాళ్ల క్రితం ‘స్టార్‌’గా వెలుగొందిన పంత్‌ను రీప్లేస్‌ చేసే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడ్డాడు..

Tags :

Advertisement