Advertisement

  • ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఆఫ్ ది డికేడ్ గా ఎంపిక అయిన ధోని

ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఆఫ్ ది డికేడ్ గా ఎంపిక అయిన ధోని

By: Sankar Mon, 28 Dec 2020 10:21 PM

ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఆఫ్ ది డికేడ్ గా ఎంపిక అయిన ధోని


భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఐసీసీ దశాబ్దపు స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు దక్కింది. ఈ ఏడాది ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఓ రనౌట్‌ అప్పీల్‌ని వెనక్కి తీసుకున్నందుకు ఐసీసీ ఈ అవార్డుకి ఎంపిక చేసింది.

2011లో ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లిన భారత్ జట్టు.. రెండో టెస్టు మ్యాచ్‌లో శతకం బాదిన ఇయాన్ బెల్‌ని రనౌట్ చేసింది. కానీ.. టీమిండియా క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఆ రనౌట్ చేసిందని ఆరోపించిన ఆ దేశ అభిమానులు.. స్టేడియంలో పెద్ద ఎత్తున ధోనీ ఛీటర్.. ఛీటర్ అంటూ నినాదాలు చేశారు.

కానీ.. నిమిషాల వ్యవధిలోనే ధోనీ హీరో అంటూ ఆ అభిమానులు ప్రశంసించారు. దానికి కారణం.. ఇయాన్ బెల్ రనౌట్‌ అప్పీల్‌ని కెప్టెన్‌ ధోనీ వెనక్కి తీసుకోవడమే. ఆ నిర్ణయమే ధోనీకి ఇప్పుడు అవార్డుని తెచ్చిపెట్టింది.కాగా ఆ మ్యాచ్ లో తొలుత రన్ అవుట్ చేసిన ధోని ఆ తర్వాత మనసు మార్చుకొని బెల్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు...

Tags :
|
|
|

Advertisement