Advertisement

  • 2011 వరల్డ్ కప్ ఫైనల్ ఫినిషింగ్ సిక్సర్ పడిన చోట ధోనికి సీట్ కేటాయించిన ఎంసీఏ

2011 వరల్డ్ కప్ ఫైనల్ ఫినిషింగ్ సిక్సర్ పడిన చోట ధోనికి సీట్ కేటాయించిన ఎంసీఏ

By: Sankar Tue, 18 Aug 2020 12:13 PM

2011 వరల్డ్ కప్ ఫైనల్ ఫినిషింగ్ సిక్సర్ పడిన చోట ధోనికి సీట్ కేటాయించిన ఎంసీఏ


భారత దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే..అయితే ధోని గౌరవార్ధం ముంబై క్రికెట్ అసోసియేషన్ వాంఖడేలో ఒక సీటుకి అతని పేరు పెట్టనుంది.2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ధోనీ కొట్టిన ఫినిషింగ్ సిక్స్ (బంతి) పడిన సీటుని ఇప్పటికే స్టేడియంలో గుర్తించామని వెల్లడించిన ఎంసీఏ..

ఆ సీటుని ప్రత్యేకంగా డెకరేట్ చేయనున్నట్లు తెలిపింది. వన్డే ప్రపంచకప్‌ని భారత్‌కి అందించిన ధోనీ గౌరవార్థం.. కి కృతజ్ఞతతో ఆ పని చేయబోతున్నట్లు ఎంసీఏ తెలిపింది. ఇప్పటికే వాంఖడే స్టేడియంలో సునీల్ గవాస్కర్‌కి రెండు శాశ్వత సీట్లు కేటాయించారు.

1987లో అంతర్జాతీయ క్రికెట్‌కి సునీల్ గవాస్కర్ రిటైర్మెంట్ ప్రకటించగానే.. అతని గౌరవార్థం వాంఖడే స్టేడియంలో అప్పట్లో రెండు సీట్లని కేటాయించారు. కానీ.. 2011 వన్డే ప్రపంచకప్‌ ఆతిథ్యం కోసం స్టేడియంలో మార్పులు చేయగా ఆ రెండు సీట్లు కనుమరుగైపోయాయి. అయితే.. ఈ ఏడాది జులై 10న 71వ పుట్టిన రోజు జరుపుకున్న గవాస్కర్‌కి బర్త్ డే గిప్ట్‌గా.. స్టేడియంలోని ప్రెసిడెంట్స్ బాక్స్‌లో గవాస్కర్, అతని భార్యకి కలిపి రెండు శాశ్వత సీట్లని ఎంసీఏ కేటయిస్తూ నిర్ణయం తీసుకుంది.

Tags :
|
|

Advertisement