Advertisement

  • చైన్నై సూపర్‌ కింగ్స్‌ కోసం ధోనీని వేటాడాం - శ్రీనివాసన్‌

చైన్నై సూపర్‌ కింగ్స్‌ కోసం ధోనీని వేటాడాం - శ్రీనివాసన్‌

By: Dimple Sat, 22 Aug 2020 9:40 PM

చైన్నై సూపర్‌ కింగ్స్‌ కోసం ధోనీని వేటాడాం - శ్రీనివాసన్‌

ధోని నాయకత్వంలో చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు ఐపీఎల్‌ చరిత్రలో విజయవంతమైన జట్టుగా పేరుపొందింది. ఇప్పటికే మూడుసార్లు టైటిల్‌ను కొల్లగొట్టిన చెన్నై రెండు సార్లు చాంపియన్‌ లీగ్స్‌ను గెలిచింది. అంతేకాదు.. ఐపీఎల్‌ సీజన్లలో 8సార్లు ఫైనల్‌ చేరిన జట్టుగా, ఎక్కువసార్లు ప్లేఆఫ్‌ మ్యాచ్‌లు ఆడిన జట్టుగా చరిత్ర సృష్టించింది.
ఎంఎస్‌ ధోని సారధ్యంలో ఏ మాత్రం అంచనాలు లేకుండా అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్‌ను గెలిచి రికార్డు సృష్టించింది. ఈ గెలుపే బీసీసీఐకి కాసుల పంట పండిస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)కు పునాది పడింది.

మహేంద్ర సింగ్‌ ధోనీ దుబాయ్‌ వేదికలపై జరిగే ఐపీఎల్‌ మ్యాచులకోసం బయలుదేరి వెళ్లేందుకు ముందుగానే... స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇంటర్నేషనల్‌ క్రికెట్ కు గుడ్ బై చెబుతూ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. క్రికెట్‌ ప్రపంచం ఈ నిర్ణయంతో ఖంగు తినింది. ప్రధాని మోడీతోసహా క్రికెటర్లు, రాజకీయనాయకులు దోనీ నాయకత్వంలో ఇండియాకు అందించిన టీ20 వరల్డ్‌ కప్‌, వన్డే ప్రపంచకప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీ కీర్తి కిరీటాలను గుర్తు చేసుకున్నారు.

ధోనీ అందించిన టీ20 ప్రపంచకప్‌తోనే ఐపీఎల్‌ పురుడు పోసుకుంది. 12 సీజన్లను పూర్తి చేసుకుని 13 యేట దుబాయ్ లో నిర్వహించేందుకు సర్వం సన్నద్దమైంది. చైన్నై సూపర్‌ కింగ్స్‌ యజమాని శ్రీనివాసన్ గత కొన్నేళ్ల క్రితమే మహేంద్రసింగ్‌ ధోనీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో ఆటగాడే కాదు... కాబోయే యజమాని అనికూడా ప్రస్తవనకు తెచ్చిన సందర్బం ఉంది. భవిష్యత్తులో ధోనీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్య బాధ్యతలను చేపడుతాడనడంలో సందేహమే లేదని పిస్తోంది.
ధోనీని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎలా దక్కించుకుందోననే విషయాన్ని శ్రీనివాసన్‌ వెల్లడించారు.

ఇండియా సిమెంట్స్‌ అధినేత, చెన్నై సూపర్‌ కింగ్స్‌ యజమాని, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్‌. శ్రీనివాసన్‌ ధోని గురించి, చైన్నై జట్టు తనను వేలంలో ఎలా దక్కించుకున్న విషయాలను పీటీఐ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. శ్రీనివాస్‌

ఆయన మాట్లాడుతూ.. 'మొదటి ఐపీఎల్‌ సీజన్‌ వేలం పాట సందర్భంగా.. యువరాజ్‌ను పంజాబ్‌ను కోరుకుంది.. వీరును ఢిల్లీ వదులకోదు.. ఇక సచిన్‌ లేకండా ముంబై జట్టును చూడలేము.. దాదా లేకపోతే.. కోల్‌కతా జట్టే ఉండదు.. అందులోనూ ఆయా ఫ్రాంచైజీలు ఐకానిక్‌ హోదా ఉన్న ఆటగాళ్లు సొంత జట్టుకే ఆడాలని తీర్మానం చేశాయి. ఐకానిక్‌ హోదాలో వీరికి అందరికంటే ఎక్కువ మొత్తం లభిస్తుంది. ధోనికి ఐకానిక్‌ హోదా లేదు.. కానీ స్టార్‌ హోదా ఉంది. అందుకే అతని కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. దీంతో ధోని రేటు అమాంతం పెరిగిపోయింది.

కానీ ఎలాగైనా ధోనిని దక్కించుకోవాలనే తపనతో వేలంలో ఎంతోదూరం వెళ్లా.. చివరకు చైన్నైకి ధోనిని తీసుకొచ్చి కెప్టెన్‌ను చేశా. అప్పడు నేను ఒక్కేటే అనుకున్నా.. మాకు ఐకానిక్‌ ఆటగాడు అవసరం లేదు.. జట్టును స్థిరంగా నడిపించే నాయకుడు చాలు.. అందుకే ధోనిని తమ ఫ్రాంచైజీలోకి తీసుకొని కెప్టెన్‌ను చేశాము. అందుకే ఇప్పటికి స్పష్టంగా చెబుతా.. ధోని ఎంపిక లెక్కలకు అందని సూత్రం అని. ' అంటూ చెప్పుకొచ్చాడు.

Tags :
|

Advertisement