Advertisement

  • ఇండియన్ క్రికెట్ లో ఒక శకం ముగిసింది ..ధోని లాంటి ఆటగాడు ఇంకొకరు లేరు , మరొకరు రారు

ఇండియన్ క్రికెట్ లో ఒక శకం ముగిసింది ..ధోని లాంటి ఆటగాడు ఇంకొకరు లేరు , మరొకరు రారు

By: Sankar Sat, 15 Aug 2020 9:21 PM

ఇండియన్ క్రికెట్ లో ఒక శకం ముగిసింది ..ధోని లాంటి ఆటగాడు ఇంకొకరు లేరు , మరొకరు రారు


ఇండియన్ క్రికెట్ లో ఒక శకం ముగిసింది..ఇండియన్ క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లలో ఒకడు అయిన మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ గుడ్ బై చెప్పాడు..అభిమానులకు షాకిస్తూ ఎంతో సాధారణంగా సోషల్ మీడియా లో తన రిటైర్మెంట్ ను ప్రకటించాడు..ఈ సందర్భంగా ధోని సాధించిన ఘనతలను తెలుసుకుందాం..

జార్ఖండ్ ..భారత దేశంలో వెనుకబడిన రాష్ట్రాలలో ఒకటి ..క్రికెట్ కు సంబంధించి అంతగా ప్రమాణాలు లేని రాష్ట్రము..అయితే అలాంటి రాష్ట్రము నుంచి ఒక జులపాల జుట్టు కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేస్తున్నాడు అంటే అందరు ఆశ్చర్యంగా చూసారు..వల్ల ఆశ్చర్యాన్ని నిజం చేస్తూ ధోని కూడా కెరీర్ ప్రారంభ మ్యాచ్ లలో సరిగా ఆడలేకపోయాడు..కీపింగ్ లో కూడా అంతంత మాత్రం గానే ఉండటంతో అప్పటి వరకు ఉన్న కీపర్ బాట్స్మన్ ల లాగానే ఇతను ఒకడు అని అందరు భావించారు..అయితే యువ ఆటగాళ్లను తయారు చేయడంలో తనకు తానే సాటి అయిన గంగూలీ ధోని ని నమ్మాడు ..ఫామ్ లో లేకపోయినప్పటికీ పాకిస్థాన్ తో విశాఖపట్నం లో జరిగిన మ్యాచ్ లో వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వెళ్లే అవకాశం ఇచ్చాడు..ఇక ఆ మ్యాచ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఇండియన్ క్రికెట్ లో ధోనికి ఎదురు లేకుండా పోయింది..

ms dhoni,retirement,announcement,cricket,career,highlights ,ఇండియన్ క్రికెట్ లో,  ఒక శకం,  ముగిసింది, మహేంద్ర సింగ్ ధోని, రిటైర్మెంట్


ఒకటా రెండా ధోని ఇండియన్ క్రికెట్ కు చేసిన సేవల గురించి ఎన్ని అని చెప్పుకుంటాము ..తొలుత లోయర్ ఆర్డర్ లో మ్యాచ్ లను ఫినిష్ చేసే ఆటగాడి కోసం చూస్తున్న ఇండియన్ టీం కు ధోని ఆ లోటును తీర్చాడు ..తర్వాత గంగూలీ , ద్రావిడ్ లో కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే సరైన కెప్టెన్ కోసం వెతుకుతున్న టీం ఇండియాకు మల్లి ధోనీనే ఆ లోటును పూడ్చాడు .1983 ప్రపంచ కప్ విజయం తర్వాత మరొక ట్రోఫీ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చుసిన అభిమానులకు ఈ సారి కూడా ధోని నే వాళ్ళ కోరికను నెరవేర్చాడు..యువ ఆటగాళ్లతో ఒకే ఒక్క టి ట్వంటీ మ్యాచ్ అనుభవంతో సౌత్ ఆఫ్రికా వెళ్లిన ధోని , వచ్చేప్పుడు మాత్రం కోట్లాది భారతీయుల ఆశ అయిన టి ట్వంటీ ప్రపంచ కప్ తీసుకోని వచ్చాడు..

ఇక ఆ తర్వాత 2010 లో ఆసియా కప్ , ఇంట , బయట టెస్టుల్లో విజయాలు ఒక్కసారిగా ఇండియన్ టీం ప్రపంచ క్రికెట్ లో స్ట్రాంగ్ టీం లలో ఒకటిగా మారిపోయింది ..ఇక అప్పుడు వచ్చింది 2011 వరల్డ్ కప్ , క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ చిరకాల కోరిక ప్రపంచ కప్ సాధించడం ..అప్పటికే చాల సార్లు ప్రయత్నించినా ఆ కల నెరవేరలేదు..ఇక ఇదే చివరి అవకాశం ఇది పోతే మల్లి ఇక సచిన్ కోరిక నెరవేరదు..దీనితో ధోని ఆటగాళ్లలో ఎలాగా అయినా ఈ కప్పు గెలవాలి సచిన్ కు ఇవ్వాలి అని ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు..సౌరవ్ గంగూలీ యువ ఆటగాళ్లను తయారు చేస్తే వారితో వారిలో ఉన్న అద్భుత ప్రదర్శనను ఎలా బయటకు తీసుకురావాలో ధోని చూయించాడు..దానికి మంచి ఉదాహరణ జహీర్ ఖాన్ ..ధోని రాకముందు అందరిలో ఒకడిగా ఉన్న జహీర్ , ధోని కెప్టెన్ అయినా తర్వాత పూర్తిగా మారిపోయాడు ..ముఖ్యంగా 2011 ప్రపంచ కప్ లో టీం ఇండియా బౌలింగ్ భారాన్ని మొత్తం జహీర్ మోశాడు ..ధోనికి ఎప్పుడు వికెట్ కావాలన్నా జహీర్ వైపు చూసేవాడు ..ఇక యువి , సెహ్వాగ్ , హర్భజన్ , గంభీర్ వంటి వారు ధోని కెప్టెన్సీ లో అద్భుత ప్రదర్శన చేశారు..దీనితో 2011 ప్రపంచ కప్ టీం ఇండియా దక్కించుకొని సచిన్ కు మర్చిపోలేని బహుమతి ఇచ్చారు..

ms dhoni,retirement,announcement,cricket,career,highlights ,ఇండియన్ క్రికెట్ లో,  ఒక శకం,  ముగిసింది, మహేంద్ర సింగ్ ధోని, రిటైర్మెంట్


ఇక ఆ తర్వాత 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ..2011 ప్రపంచ కప్ సీనియర్ల సహకారంతో సాధిస్తే , ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రం కేవలం తాను తయారు చేసిన ఆటగాళ్లతోనే ధోని సాధించాడు..మిడిల్ ఆర్డర్ లో తడబడుతున్న రోహిత్ ను ఓపెనర్ ను చేసి టీం ఇండియాకు మరొక అద్భుత అతగాడిని ధోని అందించాడు..ఇక కోహ్లీ , జడేజా , అశ్విన్ , ఇషాంత్ వంటి యువ ఆటగాళ్ల నుంచి అద్భుత ప్రదర్శనను రాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించిన ధోని తన కెప్టెన్సీ ప్రతిభ ఏంటో అందరికి తెలియజేసాడు..

అయితే లిమిటెడ్ ఓవర్ల ఫార్మటు లో అద్భుతంగానే ఉన్నప్పటికీ టెస్ట్ క్రికెట్ లో తడబడుతుండటంతో ఏ మాత్రం ఆలస్యం చేయని ధోని , తన వారసుడు అయినా కోహ్లీకి టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి తాను టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు ..ధోని ఎప్పుడైనా అంతే టీం కోసం మాత్రమే ఆలోచిస్తాడు ..టీం కు తన అవసరం లేదు అనిపిస్తే ధోని తప్పుకుంటాడు..ఇక వన్ డే ఫార్మటు లో కూడాకోహ్లీ కి అనుభవం వచ్చేదాకా కెప్టెన్ గా కొనసాగిన ధోని , ఇక కోహ్లీ కి ఇవ్వాలి అనుకున్నప్పుడు తనంతట తాను గా కెప్టెన్సీ బాధ్యతలు కోహ్లీకి అప్పగించి జట్టులో ఒక మాములు ఆటగాడిగా కొనసాగాడు..ఎందుకంటే లిమిటెడ్ ఓవర్ల ఫార్మటు లో ధోని అవసరం ఇంకా ఉంది..అందుకే తాను టీమ్ లో ఉంటూ తన ప్రత్యామ్నాయం అయినా మరొక ఆటగాడిని తయారు చేయాలను చూసాడు..కానీ ధోనికి తెలియని విషయం ఏంటి అంటే ధోని లాంటి మరొక ఆటగాడు మరొకరు ఉండరు అని..

టీం లో ఇప్పటికి కూడా అత్యంత ఫిట్ ఆటగాడు అయిన ధోని , ఇంకో ఏడాది అయినా క్రికెట్ లో ఆడుతాడు అని అభిమానులు భావించారు..క్రికెట్ గాడ్ సచిన్ లాగ ధోని కూడా రిటైర్మెంట్ తీసుకోవాలని అభిమానులు భావించారు..అయితే ధోని శైలి వేరు , తన అవసరం టీం కి లేదు అని తాను భావించిన రోజు ఎవ్వరికి చెప్పకుండానే తప్పుకుంటాడు ..ఇప్పుడు అదే చేసాడు..అందుకే అత్యంత సామాన్య రీతిలో సోషల్ మీడియా ద్వారా తన రిటైర్మెంట్ ప్రకటించి కోట్లాది అభిమానులను నిరాశలో ముంచేశాడు..ఏది ఏమైనా ధోని లాంటి ఆటగాడు ఇండియన్ క్రికెట్ లో మరొకడు రాడు అనేది వాస్తవం..వి మిస్ యు ధోని

Tags :
|

Advertisement