Advertisement

  • స్కూల్స్ ఓపెన్ చేయొద్దు అని సీఎం కు లేఖ రాసిన ఎంపీ

స్కూల్స్ ఓపెన్ చేయొద్దు అని సీఎం కు లేఖ రాసిన ఎంపీ

By: Sankar Sun, 23 Aug 2020 8:43 PM

స్కూల్స్ ఓపెన్ చేయొద్దు అని సీఎం కు లేఖ రాసిన ఎంపీ


కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం గత ఆరు నెలలుగా స్కూల్స్ , కాలేజీలు మూత పడిన విషయం తెలిసిందే..అయితే లాక్ డౌన్ లో సడలింపులు ఇచినప్పటికీ స్కూల్స్ ఓపెనింగ్ మీద మాత్రం ఇంతవరకు కేంద్రం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు..అయితే ఏపీలో సెప్టెంబర్ అయిదు నుంచి స్కూల్స్ , కాలేజీలు తెరవాలని నిర్ణయించారు.. నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆదివారం మరో లేఖ రాశారు.

రాష్ట్రంలో సెప్టెంబర్ 5వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించాలన్న నిర్ణయాన్ని వాయిదా వేయాలని కోరారు. కరోనా వైరస్ మహమ్మారి రాష్ట్రంలో ఇంకా తగ్గుముఖం పట్టలేదని, ఈ సమయంలో పాఠశాలలు తెరవడం వల్ల పిల్లలకు కోవిడ్ సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి వల్ల ప్రాణహాని ఉందని తల్లిదండ్రులు భయబ్రాంతులకు గురువవుతున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో రోజుకు 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో పాఠశాలలు తెరవాలని నిర్ణయించడం మంచిది కాదని ఎంపీ రఘురామ అభిప్రాయపడ్డారు. చిన్న పిల్లలకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, వారికి కరోనా సోకినా, దురదృష్టవశాత్తూ మృత్యువాత పడ్డా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. ‘మన ప్రభుత్వం పాఠశాలలు బాగు చేయాలని నాడు- నేడు, అమ్మఒడి, పిల్లలకు జగనన్న గోరు ముద్ద వంటి ఎన్నో మంచి పథకాలను ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు.

కానీ, పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు ప్రారంభించే అంశంపై అందరి సలహాలు, సూచనలు స్వీకరించి తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్‌కు ఎంపీ రఘరామ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పిల్లలు తల్లిదండ్రుల మనోభావాలు, పిల్లల ఆరోగ్యం పట్ల వారి ఆందోళను దృష్టిలో పెట్టుకొని సెప్టెంబర్ 5వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించాలనే నిర్ణయం వాయిదా వేయాలని రాఘురామ లేఖలో పేర్కొన్నారు.

Tags :

Advertisement