Advertisement

  • రూపాయికే భోజన క్యాంటిన్లను ప్రారంభించిన గౌతమ్ గంభీర్

రూపాయికే భోజన క్యాంటిన్లను ప్రారంభించిన గౌతమ్ గంభీర్

By: Sankar Wed, 23 Dec 2020 8:42 PM

రూపాయికే భోజన క్యాంటిన్లను ప్రారంభించిన గౌతమ్ గంభీర్


క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన గంభీర్ ప్రజలకు సేవ చేసేవారిలో ముందు వరుసలో ఉన్నాడు..కరోనా టైం లో కూడా ప్రజలకు సహాయ సహకారాలు అందించిన గంభీర్ తాజాగా మరోక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు..తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పు ఢిల్లీలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కంటిలో కనీసం ఒక ‘జన్ రసోయి’ క్యాంటీన్‌ను తెరవాలని గౌతం గంభీర్‌ యోచిస్తున్నారు. తొలి క్యాంటీన్‌ను గురువారం గాంధీనగర్‌లో గంభీర్‌ ప్రారంభించనున్నారు. రిపబ్లిక్‌ డే రోజున అశోక్‌నగర్‌లో మరొకటి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు.

కులం, మతం, లేదా ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఆహారం తీసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నదని భావిస్తున్నాను. నిరాశ్రయులకు రోజుకు రెండు పూటలా భోజనం లభించకపోవడం బాధగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జన్‌ రసోయి క్యాంటీన్లకు ప్రాణం పోస్తున్నాం” అని గంభీర్ చెప్పారు.

ఢిల్లీలోని వస్త్ర మార్కెట్‌ అయిన గాంధీనగర్‌లో జన్‌ రసోయిని పూర్తి ఆధునిక క్యాంటీన్‌గా రూపొందించారు. కేవలం రూపాయికే భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భోజనంలోకి బియ్యం, కాయధాన్యాలు, కూరగాయలు ఉండనున్నాయి. ఈ క్యాంటీన్లలో ఒకేసారి వంద మంది కూర్చునే సామర్ధ్యం కలిగివుండనున్నాయి. ప్రస్తుతం కొవిడ్‌ కారణంగా 50 మందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.

Tags :
|
|

Advertisement