Advertisement

బారీనష్టాల్లో సినిమా థియేటర్లు

By: chandrasekar Mon, 15 June 2020 11:51 AM

బారీనష్టాల్లో సినిమా థియేటర్లు


క‌రోనావైర‌స్ వ్యాప్తి ఆందోళ‌న‌ల న‌డుమ సినిమా హాళ్లు మూత‌ప‌డి దాదాపు మూడు నెల‌లు అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్ప‌టికే సినిమా షూటింగ్‌లకు అనుమ‌తిచ్చారు. మ‌రి సినిమా థియేట‌ర్ల‌ను ఎప్పుడు తెరుస్తారు? కోవిడ్‌-19 వ్యాపించ‌కుండా ఉండేందుకు థియేట‌ర్ల‌లో ఏం మార్పులు చేస్తున్నారు? థియేట‌ర్‌లో లోప‌ల సామాజిక దూరం పాటించ‌డం సాధ్య‌మేనా?

కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార‌ మంత్రిత్వ శాఖ వివ‌రాల ప్ర‌కారం భార‌త్‌లో 9,500కిపైనే సినిమా స్క్రీన్‌లు ఉన్నాయి. టికెట్ల విక్ర‌యాల ద్వారానే రోజుకు రూ.30 కోట్ల వ‌ర‌కు ఆదాయం వ‌స్తోంది. తినుబండారాలు, ఇత‌ర మార్గాల్లో వ‌చ్చే ఆదాయం దీనికి అద‌నం. అయితే లాక్‌డౌన్‌తో థియేట‌ర్ల‌పై చాలా ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డింది.

భార‌త్‌లో ఐదో అతిపెద్ద మ‌ల్టీప్లెక్సుల చైన్ మిరాజ్ సినిమాస్ తీవ్ర‌మైన న‌ష్టాల బాట ప‌ట్టింది. సంస్థ‌లో కొంత భాగాన్ని విక్ర‌యించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమిత్ శ‌ర్మ‌ ఓ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో స్ప‌ష్టంచేశారు. పీవీఆర్ సినిమాస్‌, ఐనాక్స్‌, కార్నివల్ సినిమాస్‌, సినీపోలిస్ లాంటి మ‌ల్టీప్లెక్స్ చైన్‌ల ఆదాయ‌మూ లాక్‌డౌన్‌తో పూర్తిగా లేకుండాపోయింది. ఈ థియేట‌ర్‌ చైన్‌ల‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మ‌ల్టీప్లెక్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా (ఎంఏఐ) అయితే మ‌ల్టీప్లెక్స్‌ల ఓన‌ర్లు, డెవ‌ల‌ప‌ర్ల‌‌కు బ‌హిరంగంగా సాయం కోరుతూ అభ్య‌ర్థించింది. లాక్‌డౌన్ కాలంతోపాటు మ‌ళ్లీ ప‌రిస్థితి మునుప‌టికి వ‌చ్చేవ‌ర‌కూ అద్దె, కామ‌న్ ఏరియా మెయింటెనెన్స్ నుంచి మిన‌హాయింపు ఇవ్వాలంటూ కోరింది. మ‌రోవైపు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకీ సాయం కోరుతూ ఎంఏఐ బ‌హిరంగ లేఖ విడుద‌ల చేసింది. మ‌ల్టీప్లెక్స్ ప‌రిశ్ర‌మ దాదాపు 2 ల‌క్ష‌ల మందికి ఉపాది క‌ల్పిస్తోంది. లాక్‌డౌన్ సమ‌యంలో నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు, జీతాలతో తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నాం. విద్యుత్ బిల్లులు, ఇత‌ర ఖ‌ర్చులు వీటికి అద‌నం. ఈ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డ‌టంలో సాయం చేయాలి. అని అభ్య‌ర్థించింది.

చైనా సినిమా థియేట‌ర్లు తెర‌చినా వ‌చ్చే ప్రేక్ష‌కులు అంతంత మాత్రంగానే వ‌స్తున్న‌ట్లు చైనా ఫిల్మ్ అసోసియేష‌న్ వెల్ల‌డించింది. 40 శాతానికిపైగా థియేట‌ర్ల‌ ప‌రిస్థితి మూసేసే స్థాయికి దిగ‌జారిన‌ట్లు తెలిపింది. ముఖ్యంగా 500 కంటే త‌క్కువ సీట్లుండే చిన్న సినిమా థియేట‌ర్లు తీవ్రంగా ప్ర‌భావితం అయ్యాయ‌ని, గ‌తేడాది రెవెన్యూతో పోలిస్తే ప్ర‌స్తుతం ప‌ది శాతం కూడా అర్జింజ లేక‌పోతున్నాయ‌ని సంస్థ చేప‌ట్టిన స‌ర్వేలో తేలింది. ప్రేక్ష‌కులు థియేట‌ర్లకు రాక‌పోవ‌డానికి కొత్త సినిమాలు లేక‌పోవ‌డంతోపాటు ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సేవ‌లు పెర‌గ‌డ‌మూ ఒక కార‌ణ‌మ‌ని అసోసియేష‌న్ విశ్లేషించింది.

భార‌త్‌లోనూ లాక్‌డౌన్‌తో చాలా సినిమాల షూటింగ్‌ల‌పై ప్ర‌భావం ప‌డింది. చాలా సినిమాల విడుద‌ల తేదీలు వాయిదా ప‌డ్డాయి. మ‌రికొన్ని ఎప్పుడు విడుద‌ల‌వుతాయో కూడా తెలియ‌దు. మ‌రోవైపు అమెజాన్ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, జీ-5, హాట్‌స్టార్ లాంటి స్ట్రీమింగ్ సేవ‌ల హ‌వా కొన‌సాగుతోంది. ఒరిజిన‌ల్స్ పేరుతో నేరుగా ప్లాట్‌ఫామ్‌పైనే విడుద‌ల చేసే సినిమాలు ఎక్కువ‌య్యాయి. థియేట‌ర్లు తెర‌చినా ప్రేక్ష‌కులు రాక‌పోవ‌చ్చు. మేం థియేట‌ర్ల‌ను లీజుకు తీసుకున్నాం. ఈ క‌ష్ట‌కాలంలో అద్దెలు ఇవ్వ‌క‌పోయినా ప్రాప‌ర్టీ ఓన‌ర్లు మ‌మ్మ‌ల్ని అర్థంచేసుకుంటున్నారు. నిర్వ‌హ‌ణ‌, విద్యుత్ బిల్లులు, జీతాలు మాత్రం క‌ట్టుకుంటున్నాం. విద్యుత్ బిల్లులే క‌నిష్ఠంగా నెల‌కు రూ.30 నుంచి 40 వేలు క‌ట్టాల్సి వ‌స్తోంది. లాక్‌డౌన్ తెరిచాక టికెట్ ధ‌ర‌లు పెంచితే వ‌చ్చేవారు కూడా రారు. మొద‌ట నెల సిబ్బందికి పూర్తి జీతాలు ఇచ్చాం. రెండో నెల 50 శాతం, మూడో నెల 40 శాతం జీతాలు ఇచ్చాం. ఏవైనా ఉద్యోగాలుంటే చూసుకోమ‌ని కొంద‌రికి చెప్పాం. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు న‌డిపించుకోవ‌చ్చ‌ని తెలంగాణ‌ ప్ర‌భుత్వం సూచించింది. అయితే ఇది సాధ్యంకాద‌ని నిర్మాత‌లు అంటున్నారు. 50 శాతం ఆక్యుపెన్సీకి శానిటైజేష‌న్ ప్ర‌క్రియ‌లు తోడైతే చిన్న సినిమా థియేట‌ర్లు న‌డ‌వ‌డం చాలా క‌ష్టం. విద్యుత్ బిల్లులు, మున్సిప‌ల్ ట్యాక్స్‌ల‌ను మాఫీ చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరాం. దీనిపై చర్చలు జ‌రుపుతామ‌ని సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ వివ‌రించారు.

Tags :
|
|
|

Advertisement