Advertisement

సినీ, టీవీ నటుడు రంజన్‌ సెహగల్‌ మృతి

By: chandrasekar Mon, 13 July 2020 1:37 PM

సినీ, టీవీ నటుడు రంజన్‌ సెహగల్‌ మృతి


బాలీవుడ్‌లో మరో విషాదం. వరసగా సినీ ప్రముఖులు కన్ను మూస్తూనే ఉన్నారు. ఇప్పటికే దాదాపు 25 మందికి పైగా ఈ ఏడాది మరణించారు. ఇప్పుడు మరో ప్రముఖుడు కూడా చనిపోయాడు. సినీ, టీవీ నటుడు రంజన్‌ సెహగల్‌ జులై 11న మృతి చెందాడు. ఈయన వయసు కేవలం 36 ఏళ్లు మాత్రమే.

కొంతకాలంగా అనారోగ్యతో బాధ పడుతున్న ఈయన పరిస్థితి విషమించడంతో చండీగఢ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. రంజన్ సెహగల్ మృతితో టెలివిజన్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది. అంత చిన్న వయసులో మరణించడంతో ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అతడి సహ నటులు విషయం తెలుసుకుని కన్నీరు మున్నీరవుతున్నారు. రంజన్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.

మరోవైపు రంజన్ మృతిపై సినీ అండ్‌ టీవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(సీఐఎన్‌టీఏఏ) సోషల్‌ మీడియా వేదికగా నివాళి ఆర్పించింది. 2010 నుంచి రంజన్ సీఐఎన్‌టీఏఏ సభ్యుడిగా ఉన్నాడు. ఆరేళ్ల కింద ఐశ్వర్యరాయ్‌, రణదీప్ హుడా జంటగా నటించిన సరబ్‌జీత్‌ చిత్రంలో రంజన్‌ నటించారు. ఆ చిత్రంలో రవీంద్ర పాత్ర పోషించాడు ఈయన. సరబ్‌జీత్‌తో పాటు ఫోర్స్‌, కర్మ, మహీ ఎన్‌ఆర్‌ఐ (పంజాబీ) లాంటి సినిమాలు కూడా చేసాడు రంజన్ సెహగల్. బుల్లితెరపై క్రైమ్‌ పెట్రోల్‌, సావధాన్‌ ఇండియా, తుమ్‌ దేనా సాత్ మేరా లాంటి కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

Tags :
|
|
|

Advertisement