Advertisement

  • చెన్నై నుంచి 10 కంటైనర్లలో అమ్మోనియం నైట్రేట్ హైదరాబాద్‌కు తరలింపు

చెన్నై నుంచి 10 కంటైనర్లలో అమ్మోనియం నైట్రేట్ హైదరాబాద్‌కు తరలింపు

By: chandrasekar Wed, 12 Aug 2020 6:10 PM

చెన్నై నుంచి 10 కంటైనర్లలో అమ్మోనియం నైట్రేట్ హైదరాబాద్‌కు తరలింపు


చెన్నైలో దిగుమతి చేసుకోబడిన అమ్మోనియం నైట్రేట్ 10 కంటైనర్లలో హైదరాబాద్‌కు తరలించారు. లెబనాన్ రాజధాని బీరుట్‌లో ఇటీవల అమ్మోనియం నైట్రేట్ ద్రావణం కారణంగా భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. బీరుట్ నగరమంతా ఈ పేలుడు ధాటికి నాశనం అయిపోయింది. అయితే, తాజాగా భారత్‌లో చెన్నైలో నిల్వ ఉంచిన అమ్మోనియం నైట్రేట్‌ను హైదరాబాద్‌కు తరలించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

భద్రతా చర్యల్లో భాగంగా దీన్ని తరలిస్తున్నట్లు చెబుతున్నారు. చెన్నై నుంచి 10 కంటైనర్లలో అమ్మోనియం నైట్రేట్ హైదరాబాద్‌కు చేరింది. ఈ అమ్మోనియం నైట్రేట్‌ను ఐదేళ్ల క్రితం దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్నారు. మొత్తం 740 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను చెన్నై సమీపంలోని మనలిలో ఉన్న టెర్మినల్ వద్ద 37 కంటైనర్లలో నిల్వ చేశారు. అయితే, గతంలో మూడేళ్ల క్రితం వచ్చిన చెన్నై వరదల సమయంలో 50 టన్నుల మేర అమ్మోనియం నైట్రేట్ నీటిలో, గాల్లో కలిసిపోయినట్లు అధికారులు గుర్తించారు.

నీటిలో కరిగినవి ఇంకా అక్కడ పెద్ద మొత్తంలో అమ్మోనియం నైట్రేట్ ద్రావణం నిల్వ ఉంది. ఈ క్రమంలో బీరుట్‌లో జరిగిన భారీ పేలుడుతో చెన్నై కస్టమ్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడ 37 కంటైనర్లలో అమ్మోనియం నైట్రేట్ నిల్వలు ఉండగా వాటిని 10 కంటైనర్లలో 181 టన్నుల రసాయన మిశ్రమాన్ని హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ ఈ అమ్మోనియం నైట్రేట్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

కీసర మండలం అంకిరెడ్డిపల్లెకు కంటైనర్స్ చేరాయి. ఇక్కడ నిల్వ చేసి అమ్మోనియం నైట్రేట్‌ను రీఫైన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ ముగిశాక సింగరేణి, కోల్ ఇండియా, నీటిపారుదల ప్రాజెక్టులకు సరఫరా చేస్తారని సమాచారం. ఈ రీప్రాసెసింగ్ ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తి కానున్నట్లు ఓ అధికారి తెలిపారు. మరికొద్ది రోజుల్లో మరో 20 కంటైనర్ల అమ్మోనియం నైట్రేట్‌ను చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలించనున్నారు. లెబనాన్‌లో పేలుడుకు కారణమైన ద్రావణం తమ ప్రాంతంలో నిల్వ చేయడంపై స్థానికుల్లో కాస్త ఆందోళన నెలకొంది. దీనిని త్వరగా సుద్ధి చేసి పంపిణి చేయాలనీ పరిసర ప్రాంత ప్రజల కోరిక.

Tags :

Advertisement