Advertisement

  • మోటో జీ9 పవర్ ఫోన్‌ను భారత మార్కెట్లోకి ఆవిష్కరించిన మోటోరోలా

మోటో జీ9 పవర్ ఫోన్‌ను భారత మార్కెట్లోకి ఆవిష్కరించిన మోటోరోలా

By: chandrasekar Wed, 09 Dec 2020 4:45 PM

మోటో జీ9 పవర్ ఫోన్‌ను భారత మార్కెట్లోకి ఆవిష్కరించిన మోటోరోలా


ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ మోటోరోలా భారత్‌లో మోటో జీ సిరీస్‌లో మోటో జీ 5జీ ఫోన్‌ను గతవారమే విడుదల చేసి౦ది. తాజాగా భారత మార్కెట్లోకి మోటో జీ9 పవర్ ఫోన్‌ను ఆవిష్కరించింది. మోటో జీ 9 పవర్‌ ధర రూ.11,999గా భారత్‌లో నిర్ణయించారు.

మోటో జీ 9 పవర్‌ భారత్‌లో 4GB ర్యామ్‌ + 128GB స్టోరేజ్‌ వేరియంట్‌ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎలక్ట్రిక్‌ వైలెట్‌, మెటాలిక్‌ ఏజ్‌ కలర్స్ లో విడుదలైంది.

ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే డిసెంబర్‌ 15 నుంచి లభించనుంది.

మోటో జీ9 పవర్‌ ధర మరియు స్పెసిఫికేషన్లు:

మోటో జీ9 పవర్ డిస్‌ప్లే 6.80 అంగుళాలు ఉంది. ఇందులో క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 662 ప్రాసెసర్ అందుబాటులో ఉంది.

ఇందులో 16 మెగా పిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా అందుబాటులో ఉంది. రియర్‌ కెమెరా 64+2+2 మెగా పిక్సల్‌గా ఉంది.

ఇందులో 4జీబీ ర్యామ్ అందుబాటులో ఉండగా, 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ అందుబాటులో ఉంది. బ్యాటరీ 6000mAh కాగా, ఓఎస్ ఆండ్రాయిడ్‌ 10


Tags :

Advertisement