Advertisement

మోటో జీ9 పవర్ అమ్మకాలు ప్రారంభం...

By: chandrasekar Tue, 15 Dec 2020 4:09 PM

మోటో జీ9 పవర్ అమ్మకాలు ప్రారంభం...


మనదేశంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోరోలా ఇటీవలే మోటో జీ9 పవర్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసి౦ది. ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకం ఈరోజు నుండి జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్‌లో ఈ సేల్ ప్రారంభం కానుంది.

మోటో జీ9 పవర్ స్పెసిఫికేషన్లు

దీనిలో ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో లాంచ్ అయిన ఈ వేరియంట్ ధరను రూ.11,999గా నిర్ణయించారు ఎలక్ట్రిక్ వయొలెట్, మెటాలిక్ సేజ్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

దీనిలో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 128 జీబీ స్టోరేజ్, 64 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లను అందించారు. మోటో జీ9 సిరీస్‌లో ఈ ఫోన్ లాంచ్ అయింది.

దీనిలో 6.8 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్ ప్లేను అందించారు. డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20.5:9గా ఉంది.

ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్‌పై మోటో జీ9 పవర్ పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు.

స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాల సెటప్ అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

వీటిలో ప్రధాన కెమెరా కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి.

4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో అందించారు.

దీని మందం 0.96 సెంటీమీటర్లు కాగా, బరువు 221 గ్రాములుగా ఉంది.

బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్, 20W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ వెనకభాగంలో అందించారు.

Tags :
|
|

Advertisement