Advertisement

  • స్వర్ణ ప్యాలస్ ఘటనలో మృతి చెందిన తల్లీ కొడుకు ..తీవ్ర దిగ్బ్రాంతిలో కుటుంబ సభ్యులు

స్వర్ణ ప్యాలస్ ఘటనలో మృతి చెందిన తల్లీ కొడుకు ..తీవ్ర దిగ్బ్రాంతిలో కుటుంబ సభ్యులు

By: Sankar Mon, 10 Aug 2020 10:09 AM

స్వర్ణ ప్యాలస్ ఘటనలో మృతి చెందిన తల్లీ కొడుకు ..తీవ్ర దిగ్బ్రాంతిలో కుటుంబ సభ్యులు



ఆ ఇంట్లో నలుగురు కరోనా బారిన పడ్డారు ..అందులో ఇద్దరికీ తీవ్ర లక్షణాలు ఉండటంతో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేసారు ..అయితే మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్తాము అని అనుకుంటుండగా ఊహించని ప్రమాదం ఆ కుటుంబాన్ని అంధకారంలో పడేసింది ..విజయవాడలోని స్వర్ణ ప్యాలస్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో జయలక్ష్మి, పవన్‌కుమార్‌ కుటుంబంలోని విషాదగాథ ఇది ..

కందుకూరు పట్టణంలోని గణేష్‌నగర్‌లో నివాసం ఉండే దుడ్డు ప్రసాద్‌ ఎన్‌టీఆర్‌ బొమ్మ సెంటర్‌లో కిరాణా షాపు నిర్వహిస్తుంటాడు..గత నెల 30వ తేదీన కరోనా వైరస్‌ బారిన పడ్డాడు. మెరుగైన వైద్యం తీసుకోవాలని విజయవాడ రమేష్‌ హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యాడు. చికిత్స అనంతరం ఆయన కోలుకుని రెండు రోజుల క్రితమే ఇంటికి చేరాడు. అయితే ప్రసాద్‌ నుంచి వైరస్‌ ఆయన భార్య వెంకట జయలక్ష్మి (48), ఆయన పెద్దకుమారుడు పవన్‌కుమార్‌ (30), రెండో కుమారుడు మనోజ్‌కు సోకింది. కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్ష చేయించుకోవడంతో పాజిటివ్‌గా తేలింది..

అధికంగా లక్షణాలు ఉన్న వెంకట జయలక్ష్మి, పవన్‌కుమార్‌లు కూడా రమేష్‌ హాస్పిటల్‌లోనే జాయిన్‌ అయ్యారు. ఐదు రోజులుగా వారిని స్వర్ణ ప్యాలెస్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎంబీబీఎస్‌ చదువుతున్న రెండో కుమారుడు మనోజ్‌కు మాత్రం లక్షణాలు స్వల్పంగా ఉండడంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లోనే ఉండి జాగ్రత్తలు పాటిస్తున్నాడు.

రమేష్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న జయలక్ష్మి, పవన్‌ కుమార్‌లు కూడా ప్రస్తుతం కోలుకుని ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో ఇంటికి పంపిస్తామని అక్కడి వైద్యులు చెప్పారు. ఇంతలోనే ఊహించని విధంగా జరిగిన అగ్ని ప్రమాదంలో వారు ఇరువురూ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. స్వర్ణ ప్యాలెస్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఆదివారం తెల్లవారు జామున జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న తల్లి, కుమారుడు ఇద్దరూ మృతిచెందారు. ఈ వార్త తెలిసిన వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. కరోనా నుంచి కోలుకున్నా అగ్ని ప్రమాదం వాళ్ల పాలిట యమపాశంగా మారిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Tags :
|
|

Advertisement