Advertisement

  • కాశ్మీర్‌లో ఎక్కువ మంది భారత్‌ దేశాన్ని విశ్వసిస్తున్నారు: లెఫ్టినెంట్‌ జనరల్‌

కాశ్మీర్‌లో ఎక్కువ మంది భారత్‌ దేశాన్ని విశ్వసిస్తున్నారు: లెఫ్టినెంట్‌ జనరల్‌

By: chandrasekar Thu, 17 Dec 2020 1:11 PM

కాశ్మీర్‌లో ఎక్కువ మంది భారత్‌ దేశాన్ని విశ్వసిస్తున్నారు: లెఫ్టినెంట్‌ జనరల్‌


ఇండో-పాక్‌ యుద్ధం జరిగి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యుద్ధంలో మరణించిన జవాన్లకు జీఓసీ చినార్‌ కార్ప్స్‌ నివాళులర్పించింది. ఈ సందర్బంగా చినార్‌ కార్ప్స్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ బీఎస్‌ రాజు‌ మాట్లాడుతూ.. జమ్మూకాశ్మీర్‌ యువతను తప్పుదోవ పట్టించేందుకు పాకిస్థాన్‌ ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. కాశ్మీర్‌లోని జనాభాలో ఎక్కువ మంది భారత్‌ దేశాన్ని విశ్వసిస్తున్నారని, పెద్ద సంఖ్యలో దారి తప్పిన యువత జన స్రవంతిలోకి వచ్చారన్నారు. లోయలో అస్థిరతను పాక్‌ కోరుకుంటుందని స్పష్టమైందన్నారు.

భారతదేశం 1971లో పాక్‌ నుంచి బంగ్లాదేశ్‌ను విముక్తి చేయడంలో సాధించిన విజయానికి సంకేతంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 16న విజయ్‌ దివస్‌ నిర్వహించడం అలవాటుగా వస్తోంది.

ప్రస్తుతం మనం బలంగా ఉన్నామని, కాశ్మీర్‌ లోపల, దేశాన్ని అస్థిరపరిచే పాక్‌ ప్రతి ప్రయత్నాన్ని విఫలం చేస్తున్నామని తెలిపారు.

Tags :
|
|

Advertisement