Advertisement

  • గూగుల్ లో ఎక్కువగా కరోనా ను వెతికిన భారతీయులు ...

గూగుల్ లో ఎక్కువగా కరోనా ను వెతికిన భారతీయులు ...

By: Sankar Fri, 03 July 2020 1:55 PM

గూగుల్ లో ఎక్కువగా కరోనా ను వెతికిన భారతీయులు ...



ప్రపంచ వ్యాప్తంగా కరోనా వలన పరిస్థితులు అన్ని మారిపోయాయి ..ఇప్పుడు ఏ దేశంలో చుసిన , ఏ నగరం లో , ఏ పల్లెలో ఇలా ఎక్కడ చుసిన అందరి నోటా వచ్చే మాట కరోనా గురించే ..కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను అంతలా ప్రభావితం చేసింది ..గత మూడు నెలలుగా ప్రజలు అన్ని పనులు మానుకొని కేవలం కరోనా గురించే మాట్లాడుకొనే పరిస్థితి వచ్చింది ..టీవీల్లో , పేపర్లలో ఇలా ఎక్కడ చుసిన కారొనకు సంబంధించిన న్యూస్ మాత్రమే ..ఇంతకుముందు ఏ హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది , లేదా ఇండియా క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు ఏ దేశంతో ఉంది , దేశంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి చర్చించుకునే ప్రజలు, ఇప్పుడు దేశంలో రోజు ఎన్ని కరోనా కేసులు నమోదు అవుతున్నాయి , ఏ రాష్ట్రంలో కేసులు ఎలా ఉన్నాయి , ఎంత మంది చనిపోయారు , ఎంత మంది కోలుకున్నారు అని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది ..

ఇదే విషయాన్నీ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ కూడా తెలిపింది ..కరోనా వైరస్‌ బలహీనపడుతోందా? భారతదేశంలో కరోనా వాక్సిన్‌ ఎప్పుడు వస్తుంది? అసలు ఈ మహమ్మారికి ముగింపు ఉందా? ఇలాంటి ప్రశ్నలను జూన్‌ నెలలో భారతీయ నెటిజన్లు సెర్చ్‌ చేసినట్టు గూగుల్‌ సెర్చ్‌ ట్రెండ్స్‌ వెల్లడించింది. కరోనా వైరస్‌కి ఏ మాస్క్‌ మంచిది, కరోనా వైరస్‌ని న్యూజిలాండ్‌ ఎలా అణచివేసింది, కరోనా వైరస్‌ లక్షణాలు ఎన్ని రోజులు ఉంటాయి, ప్రపంచంలో కరోనా వైరస్‌ వల్ల ఎంతమంది మరణించారు లాంటి ప్రశ్నలను నెటిజన్లు అడిగినట్లు గూగుల్‌ డేటా ద్వారా తెలిసింది. మేతో పోలిస్తే జూన్‌లో కరోనా వైరస్‌ గురించి నెటిజన్లు సెర్చ్‌ చేయడం 66 శాతం తగ్గింది, ఫిబ్రవరిలో కంటే జూన్‌లో కరోనాపై గూగుల్‌ సెర్చ్‌ రెట్టింపు కంటే ఎక్కువైందని తేలింది.

Tags :
|
|
|

Advertisement