Advertisement

  • ప్రపంచవ్యాప్తంగ ఎక్కువ కరోనా కేసులు ఈ 3 దేశాల నుంచే వస్తున్నాయంట.

ప్రపంచవ్యాప్తంగ ఎక్కువ కరోనా కేసులు ఈ 3 దేశాల నుంచే వస్తున్నాయంట.

By: Anji Mon, 31 Aug 2020 07:45 AM

ప్రపంచవ్యాప్తంగ ఎక్కువ కరోనా కేసులు ఈ 3 దేశాల నుంచే వస్తున్నాయంట.

చైనాలో పుట్టిన కరోనా వైరస్ అక్కడ తగ్గుముఖం పట్టి, ఆ దేశంలో స్కూల్స్ తో పాటు వాటర్ పార్క్స్ ఇలా అన్ని ఓపెన్ కావడంతో పాటు అసలు మాస్క్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదని అక్కడ ప్రభుత్వం ప్రకటిస్తే మిగిలిన దేశాలలో మాత్రం పరిస్థితి రోజు రోజుకి దారుణంగా మారుతుంది.

మన భారత్ తో పాటు అమెరికా, బ్రెజిల్ ఈ మూడు దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా కేసులలో 53.36 శాతం నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తుంది. దీనికి సంబంధించి జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తెలియచేస్తూ అమెరికాలో 59 లక్షల కేసులు, బ్రెజిల్ లో 38 లక్షలు, భారత్ లో 35 లక్షల కేసులు నమోదయ్యాయి. ప్రపంచం మొత్తం మీద నమోదైన 2.5 కోట్ల కేసులలో ఈ మూడు దేశాలు సగానికి పైగా పంచుకోవడం చూస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతుంది.

ఇప్పుడు అమెరికా బ్రెజిల్ లో గతంతో పోలిస్తే కాస్త కేసులు తగ్గుముఖం పడితే భారత్ లో మాత్రం రోజు రోజుకి పెరుగుతున్నాయి. నిన్న అమెరికాలో 42,843 కేసులు వస్తే బ్రెజిల్ లో 34,360 కేసులు, భారత్ లో మాత్రం ఏకంగా 78,472 కేసులు నమోదయ్యాయి. ఇలా మన దేశంలో రోజు రోజుకి కేసులు పెరగడంతో మరింత ఆందోళన వ్యక్తమవుతుంది. మరణాల విషయంలో కూడా మన భారత్ లో రోజుకి వెయ్యి వరకు సంభవిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.

Tags :
|
|

Advertisement