Advertisement

  • కార్తీక్ కెప్టెన్సీ అప్పగించడంపై స్పందించిన కేకేఆర్ కొత్త కెప్టెన్ మోర్గాన్

కార్తీక్ కెప్టెన్సీ అప్పగించడంపై స్పందించిన కేకేఆర్ కొత్త కెప్టెన్ మోర్గాన్

By: Sankar Fri, 16 Oct 2020 10:59 PM

కార్తీక్ కెప్టెన్సీ అప్పగించడంపై స్పందించిన కేకేఆర్ కొత్త కెప్టెన్ మోర్గాన్


కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు నయా సారథిగా ఇయాన్‌ మోర్గాన్‌ నియమించబడ్డ సంగతి తెలిసిందే. ఈరోజు(శుక్రవారం) కేకేఆర్‌ కెప్టెన్సీ పదవికి దినేశ్‌ గుడ్‌ బై చెప్పడంతో ఆ బాధ్యతల్ని మోర్గాన్‌కు అప్పచెప్పారు. తాను కెప్టెన్సీ పదవిని చేయలేకపోతున్నాననే కారణాన్ని దినేశ్‌ తెలపడంతో దాన్ని కేకేఆర్‌ ఫ్రాంచైజీ యాజమాన్యం గౌరవించింది.

అయితే కెప్టెన్‌గా తప్పుకునే విషయాన్ని తనకు ముందుగానే చెప్పినట్లు మోర్గాన్‌ తెలిపాడు. ‘ నిన్న(గురువారం)నే కెప్టెన్సీ మార్పుపై చర్చ జరిగింది. కార్తీక్‌ నా వద్దకు వచ్చాడు. అప్పుడు కోచ్‌లు కూడా అక్కడే ఉన్నారు. నేను కెప్టెన్సీ పదవి నుంచి వైదొలుగుతానని కార్తీక్‌ చెప్పాడు. బ్యాటింగ్‌పై ఫోకస్‌ చేయాలనే ఉద్దేశంతోనే తప్పుకుంటున్నట్లు నాతో చెప్పాడు.

కెప్టెన్సీ బాధ్యతలతో బ్యాటింగ్‌పై ఫోకస్‌ చేయలేకపోతున్నానని అందుకే తప్పుకోవాలనుకుంటున్నట్లు తెలిపాడు. అది జట్టు కూడా మంచిదని వివరించాడు. కార్తీక్‌ నిస్వార్థంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ధైర్యం కావాలి’ అని ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో భాగంగా టాస్‌ వేయడానికి వచ్చినప్పుడు మోర్గాన్‌ స్పష్టం చేశాడు.

Tags :
|

Advertisement