Advertisement

  • ఢిల్లీలో నివసిస్తున్న వారిలో 23 శాతం మందికిపైగా కరోనా

ఢిల్లీలో నివసిస్తున్న వారిలో 23 శాతం మందికిపైగా కరోనా

By: chandrasekar Tue, 21 July 2020 6:53 PM

ఢిల్లీలో నివసిస్తున్న వారిలో 23 శాతం మందికిపైగా కరోనా


రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సెరోప్రెవలెన్స్ అధ్యయనం ద్వారా దేశ రాజస్థాని ఢిల్లీలో నివసిస్తున్న వారిలో 23 శాతం మందికిపైగా కరోనా సోకిందని తెలిసింది. దేశంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి ఆరు నెలలైంది. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం ఇటీవల ఒక సర్వే నిర్వహించింది.

ఆ వివరాలను మంగళవారం వెల్లడించింది. ఢిల్లీలోని 23.48 శాతం ప్రజల్లో కరోనా వల్ల వారి రక్తంలో యాంటీబాడీలు ఏర్పడినట్లు ఈ అధ్యయనం ద్వారా గుర్తించారు. మరోవైపు కొందరికి కరోనా సోకినప్పటికీ వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడాన్ని గమనించారు. ఢిల్లీ జనాభాలో చాలా మందికి కరోనా ముప్పు ఉన్నదని, ఈ నేపనథ్యంలో నియంత్రణ చర్యలు కఠినంగా చేపట్టాలని ఈ అధ్యయనం హెచ్చరించింది.

మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, సమూహాలకు దూరంగా ఉండటం వంటివి ప్రజలు పాటించాలని సూచించింది. ఢిల్లీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జూన్ 27 నుంచి జూలై 10 వరకు ఈ అధ్యయనం జరిపారు.

Tags :

Advertisement