Advertisement

  • పాల డెయిరీలో అమ్మోనియం గ్యాస్ లీకేజ్ వల్ల 20 మందికి పైగా తీవ్ర అస్వస్థత

పాల డెయిరీలో అమ్మోనియం గ్యాస్ లీకేజ్ వల్ల 20 మందికి పైగా తీవ్ర అస్వస్థత

By: chandrasekar Fri, 21 Aug 2020 12:59 PM

పాల డెయిరీలో అమ్మోనియం గ్యాస్ లీకేజ్ వల్ల 20 మందికి పైగా తీవ్ర అస్వస్థత


పాల డైరీలో అమ్మోనియం గ్యాస్ లీక్ అయింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం బండపల్లి రైల్వే గేట్ వద్ద ఒక పాల డైరీలో అమ్మోనియం గ్యాస్ లీక్ అయింది. అందులో పని చేస్తున్న 20 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా చిత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఎక్కువగా మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది. పూతలపట్టు పాల డెయిరీలో గ్యాస్‌ లీకేజీ ఘటనపై జిల్లా కలెక్టర్‌తో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు.

గ్యాస్‌ లీకేజీ వల్ల అస్వస్థతకు గురైన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు అధికారులను ఆదేశించారు. పాల డెయిరీలో అమ్మోనియం గ్యాస్ లీకేజ్ ఘటన పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్యాస్ లీకేజ్‌లో 20 మందికిపైగా కార్మికులు అస్వస్థతకు గురికావడం బాధాకరంమని అన్నారు. కొంత మంది పరిస్థితి విషమంగా ఉందని తమకు సమాచారం అందిందని తెలిపారు. అస్వస్థతకు గురైన అందరికీ వెంటనే మెరుగైన వైద్య సహాయం అందించాలని లోకేశ్ కోరారు.

Tags :
|

Advertisement