Advertisement

  • మాతా వైష్ణోదేవి దర్శనానికి ఇక ప్రతి రోజు 15 వేల మంది భక్తులకు అనుమతి

మాతా వైష్ణోదేవి దర్శనానికి ఇక ప్రతి రోజు 15 వేల మంది భక్తులకు అనుమతి

By: chandrasekar Sat, 31 Oct 2020 09:23 AM

మాతా వైష్ణోదేవి దర్శనానికి ఇక ప్రతి రోజు 15 వేల మంది భక్తులకు అనుమతి


మాతా వైష్ణోదేవి దర్శనానికి ఇక ప్రతి రోజు 15 వేల మంది భక్తులకు అనుమతినిచ్చారు. జమ్మూ-కశ్మీర్ ప్రభుత్వం తెలిపిన సమాచారం ప్రకారం ఇకపై ప్రతీ రోజు 15 వేల మంది భక్తులకు మాతా వైష్ణోదేవిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు ఈ సంఖ్య కేవలం 7 వేలు మాత్రం ఉంది. దీంతో పాటు దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తులు 14 రోజుల హోం క్వారైంటైన్ అవ్వాల్సిన నియమాన్ని కూడా తొలగించారు. నవరాత్రుల సమయంలో ప్రతీ రోజు 39,000 మంది భక్తులు త్రికూట పర్వతంపై ఉన్న అమ్మవారిని దర్శించుకునే వెసులుబాటును కల్పించారు. ష్రైన్ బోర్డు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యను పెంచినా కానీ సెక్యూరిటీ నియమాలను పాటించేలా అన్ని చర్యలు తీసుకోనున్నారట. భక్తులలందరు తగు జాగ్రత్తలతో దర్శనానికి రావాలని సూచించారు.

అమ్మ వారి దర్శనానికి వస్తున్న భక్తులను కరోనావైరస్ సంక్రమణ నుంచి దూరంగా ఉంచడానికి అక్కడి అధికారులు అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్కడి వచ్చే పర్యాటకులు, భక్తులు వాటిని పాటించాలి అని కోరుతున్నారు. దాంతో పాటు ఎలాటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నవరాత్రి సమయంలో ష్రైన్ బోర్డు పవిత్ర గుహ దగ్గర తీర్థయాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 24 గంటల పాటు మంచి నీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, నిత్యవసరాల సరఫరా వంటి ఏర్పాట్లు చేసింది బోర్డు. దాంతో పాటు ఫాస్ట్ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసింది. యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. దాంతో పాటు మాతా వైష్ణోదేవి మొబైల్ యాప్ కూడా లాంచ్ చేసింది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీనివల్ల అమ్మవారి దర్శన వివరాలు తెలుసుకోవచ్చును.

Tags :

Advertisement