Advertisement

  • 63 ఏళ్ల ఓ వజ్రాల వ్యాపారి పుట్టిన రోజు వేడుకలకు మొత్తం100 మందికిపైగా హాజరు...20మందికి కరోనా

63 ఏళ్ల ఓ వజ్రాల వ్యాపారి పుట్టిన రోజు వేడుకలకు మొత్తం100 మందికిపైగా హాజరు...20మందికి కరోనా

By: chandrasekar Mon, 06 July 2020 2:04 PM

63 ఏళ్ల ఓ వజ్రాల వ్యాపారి పుట్టిన రోజు వేడుకలకు మొత్తం100 మందికిపైగా హాజరు...20మందికి కరోనా


ప్రతి రోజు తెలంగాణ వ్యాప్తంగా నమోదయ్యే కేసుల్లో ఎక్కువ శాతం హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతున్నాయి. దాంతో నగరంలో పుట్టినరోజు వేడుకలు,పార్టీలు నిర్వహించకూడదని పోలీసులు ఇప్పటికే హెచ్చరించారు. అయినప్పటికీ కొంతమందిలో మాత్రం మార్పు రావటంలేదు.

నిబంధనలు బేఖాతరు చేస్తూ పార్టీలు, పెళ్లిళ్లు జరుపుకుంటున్నారు. దీంతో కరోనా వ్యాప్తి మరింత ఎక్కువవుతోంది. తాజాగా హిమాయత్ నగర్ లో 63 ఏళ్ల ఓ వజ్రాల వ్యాపారి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ వేడుకలకు ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు బంగారు వర్తకులు కలిసి మొత్తం100 మందికిపైగా హాజరయ్యారు.

అయితే పార్టీ జరిగిన రెండురోజులకు వ్యాపారి అస్వస్థతకు గురయ్యాడు. దగ్గు, ఆయాసంతో బాధపడుతుండడంతో ఓ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు ముందు జాగ్రత్తగా అతడికి కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. దాంతో వ్యాపారి ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరగా కరోనా పాజిటివ్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. పరిస్థితి అప్పటికే విషమించడంతో ఆస్పత్రిలో చేరిన మరుసటి రోజే అతడు మరణించాడు. తర్వాత 5 రోజులకే పార్టీలో పాల్గొన్న జువెలరీ అసోసియేషన్ ప్రతినిధి కూడా కరోనా తో మృతిచెందాడు.

అంతే కాకుండా ఇప్పటివరకు పార్టీకి హాజరైన 20మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అయితే ఈ వేడకకు తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరైనట్లు సమాచారం. దీంతో ఇప్పుడు వారిలో టెన్షన్ మొదలయ్యింది. విషయం బయటకు రాకుండా బర్త్ డే పార్టీలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు రహస్యంగా కరోనా పరీక్షలు చేయించుకున్నట్టు సమాచారం.

Tags :
|

Advertisement