Advertisement

ఆండ్రాయిడ్ 11 లో వ్యక్తిగత డేటాకు మరింత భద్రత

By: chandrasekar Fri, 11 Sept 2020 6:07 PM

ఆండ్రాయిడ్ 11 లో వ్యక్తిగత డేటాకు మరింత భద్రత


ఇప్పుడు ప్రతి వ్యక్తి చేతిలో స్మార్ట్ ఫోన్ తప్పుకుండా ఉంటుంది. ప్రతి పరివర్తనకు ముఖ్యంగా తమ స్మార్ట్ ఫోన్ లనే అందరూ వాడుతున్నారు. ప్రతిఏడాది ఆండ్రాయిడ్ తన సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ కోసం తీసుకొచ్చే గూగుల్ ఈసారి ఆండ్రాయిడ్ 11 పేరిట మరో అప్ డేట్ వస్తోంది.

ప్రస్తుతం వినియోగంలో ఉన్న, భవిష్యత్తులో విడుదలకానున్న స్మార్ట్ ఫోన్ లను దృష్టిలో ఉంచుకుని ఆండ్రాయిడ్ సరికొత్త ఫీచర్లను జోడిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో వ్యక్తిగత డేటా భద్రత గురించి సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే వ్యక్తిగత సమాచారం భద్రతే లక్ష్యంగా ఆండ్రాయిడ్ 11ను తీసుకొస్తున్నది.

ఆండ్రాయిడ్ ఓఎస్ 11లో గూగుల్ కొత్త వర్క్ ప్రొఫైల్ను అందిస్తోంది.ఈ కొత్త వెర్షన్ లో ఉద్యోగులకు వారి లొకేషన్ ప్రైవసీ గురించి మరింత సమాచారం ఇవ్వడానికి, ఎప్పుడైనా వారి ఐటీ అడ్మిన్ యాప్లు పనిచేయడానికి లొకేషన్ యాక్సెస్ ఇచ్చినప్పుడు మేం కొత్త నోటిఫికేషన్ను జోడిస్తామని గూగుల్ మంగళవారం బ్లాగ్ పోస్ట్లో తెలిపింది.

Tags :
|

Advertisement