Advertisement

  • ట్రంప్ ఓటమిని అంగీకరించకపోవడం వలన దేశంలో మరిన్ని కరోనా మరణాలు పెరుగుతాయి...జో బిడెన్

ట్రంప్ ఓటమిని అంగీకరించకపోవడం వలన దేశంలో మరిన్ని కరోనా మరణాలు పెరుగుతాయి...జో బిడెన్

By: Sankar Tue, 17 Nov 2020 08:05 AM

ట్రంప్ ఓటమిని అంగీకరించకపోవడం వలన దేశంలో మరిన్ని కరోనా మరణాలు పెరుగుతాయి...జో బిడెన్


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమిని అంగీకరించకపోవడం, పరివర్తన ప్రక్రియలో సమన్వయం చేయడానికి నిరాకరించడంతో దేశంలో మరిన్ని కొవిడ్‌ మరణాలకు దారి తీయవచ్చని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ హెచ్చరించారు. ట్రంప్ యంత్రాంగం ఇంకా అధికారికంగా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌ను అధికారికంగా గుర్తించలేదు.

ఈ క్రమంలో ఆయన బైడెన్‌ బృందం జాతీయ భద్రతా సమస్యలపై నిఘా బ్రీఫింగ్‌లు అందడం లేదు. ఈ క్రమంలో ఆయన కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యాక్సిన్ల పంపిణీపై సూచనలు చేశారు. సోమవారం డెలావర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ కోసం సమన్వయ ప్రణాళికలు రూపొందించాలని, లేదంటే మహమ్మారికి మరింత మంది బలవుతారని డోనాల్డ్‌ ట్రంప్‌ను హెచ్చరించారు.

తాము ఇప్పుడు సమన్వయం చేయకపోతే ఎక్కువ మంది చనిపోతారని, ప్రస్తుతం టీకా ముఖ్యమని, అంత వరకు ఏం చేసినా పెద్దగా ఉపయోగముండదని పేర్కొన్నారు. 300 మిలియన్ల అమెరిక్లకు టీకా పంపిణీ చేయడం పెద్ద పని అని.. ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

Tags :
|
|

Advertisement