Advertisement

కోతి వీడియో వైరల్...నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్

By: chandrasekar Tue, 11 Aug 2020 09:21 AM

కోతి వీడియో వైరల్...నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్


కోతి అనగానే ముందుగా అందరికీ కోతి వేషాలే గుర్తుకు వస్తాయి. అలాగే కొన్నిసార్లు అచ్ఛం మనుషుల్లాగే ప్రవర్తిస్తూ ఎంతో ఆకట్టుకుంటాయి. అలాంటి ఒక వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ఉన్న కోతి పేరు జార్జ్. జార్జ్ తనకు గిఫ్టుగా వచ్చిన బాక్స్ తీసుకొని అందులో ఏం ఉందా అనే సందేహంతో ఎంతో ఆతృతగా తెరిచి చూసింది. అందులో ఉన్న వాటర్ బాటిల్‌ని చూసిన కోతి ఆ బాటిల్ మూతని తెరిచి లోపలికి తొంగి చూసి తదేకంగా పరిశీలించింది. ఆ తరువాత అందులో ఏం లేదు అని గ్రహించిందేమో మళ్లి ఆ బాటిల్ కి మూత పెట్టేసింది.

అలాగే కోతి ఆ బాటిల్‌తో పాటు వచ్చిన మ్యానువల్‌ను 'చదవడం' ప్రారంభించింది. ఆ కోతి ఆ మ్యానువల్‌ను అచ్ఛం మనుషుల్లాగే ఆ ప్రోడక్టుని ఎలా ఉపయోగించాలి అన్నట్లు చదువుతుంటే దాని ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే నవ్వు ఆపుకోలేరు.

ఇప్పటికే ఈ కోతి వీడియో వైరల్ అవ్వడమే కాకుండా నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తున్నారు. కోతి చేష్టలు చూసి ఎవరైనా నవ్వాపుకోలేరు. అందులోనూ ఈ కోతి చేష్టలు ఇంకా సూపర్ అనిపిస్తున్నాయి.

Tags :
|
|
|

Advertisement