Advertisement

  • ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మోదీ వీడియోకాన్ఫరెన్స్‌

ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మోదీ వీడియోకాన్ఫరెన్స్‌

By: chandrasekar Thu, 11 June 2020 02:22 AM

ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మోదీ వీడియోకాన్ఫరెన్స్‌


కేదార్‌నాథ్‌ ఆలయ అభివృద్ధి పనులను ఇవాళ ప్రధాని మోదీ సమీక్షించారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఆయన వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఆలయాన్ని అభివృద్ధి, పునర్‌ నిర్మాణం కోసం విజన్‌తో పని చేయాలని ప్రధాని మోదీ ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్రంలో ఉన్న కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ లాంటి ఆలయాల అభివృద్ధి కోసం కూడా ప్రణాళికలు వేయాలని, పర్యావరణ హితమైన ఏర్పాట్లు చేయాలని ప్రధాని సూచించారు. రాంబన్‌ నుంచి కేదార్‌నాథ్‌ మధ్య ఉన్న అనేక వారసత్వ, మతపరమైన ప్రదేశాలను కూడా డెవలప్‌ చేయాలని మోదీ ప్రత్యేక సూచన చేశారు. కేదార్‌నాథ్‌ ఆలయ రీడెవలప్‌మెంట్‌తో పాటు పలు పనులను మోదీ సమీక్షించినట్లు పీఎంవో కార్యాలయం పేర్కొన్నది.

ప్రస్తుత పరిస్థితుల లో పర్యాటకులు లేని కారణంగా పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనులను పూర్తి చేయాలని మోదీ సూచించారు. బ్రహ్మ కమల వాటిక అభివృద్ధి గురించి కూడా మోదీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మ్యూజియం, వాసుకీ తాల్‌, టౌన్‌ క్వార్టర్స్‌ అభివృద్ధి లాంటి వాటి గురించి కూడా ఆయన అడిగారు. ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌తో పాటు సీనియర్‌ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Tags :
|

Advertisement