Advertisement

  • 21 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నమోడీ

21 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నమోడీ

By: chandrasekar Wed, 17 June 2020 7:48 PM

21 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నమోడీ


కరోనా వైరస్‌ వ్యాప్తి రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై పీఎం మోడీ రాష్ట్రాల సీఎంలతో మేదోమథనం చేశారు. 21 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్లతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కొవిడ్‌ మరణాల సంఖ దేశంలో తక్కువగానే ఉందన్నారు.

ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడం తప్పనిసరి అన్నారు. మాస్కులు లేకుండా ప్రజలు బయటకు వెళ్లకూడదని సూచించారు. మాస్కు ధరించడం వల్ల వ్యక్తిగతంగా మనకు, మన ప్రక్కవారికి మంచిదన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తే తక్కువ నష్టం ఉంటుందన్నారు.

దేశంలో ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోందన్న పీఎం ఎగుమతులు పూర్వస్థితికి వచ్చాయన్నారు. పరిశ్రమలకు తక్షణ రుణ సదుపాయం కల్పించాలని బ్యాంకర్లకు సూచించినట్లుగా తెలిపారు.

పరిశ్రమలకు సత్వర రుణాలిస్తే ఉత్పత్తి ప్రారంభమై ఉపాధి లభిస్తుందని చెప్పారు. సంస్కరణలతో వ్యవసాయరంగం వృద్ధి చెందిందన్నారు. లాక్‌డౌన్‌ను సడలించి రెండు వారాలు గడిచిపోయాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సలహాలు, సూచనలు అందిస్తే భవిష్యత్తు ప్రణాళికలకు ఉపయుక్తంగా ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు.

Tags :
|

Advertisement