Advertisement

  • మోడీ ఖాతాలో మరొక రికార్డు ..అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన కాంగ్రెస్ యేతర నేతగా సరికొత్త రికార్డు

మోడీ ఖాతాలో మరొక రికార్డు ..అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన కాంగ్రెస్ యేతర నేతగా సరికొత్త రికార్డు

By: Sankar Fri, 14 Aug 2020 10:14 AM

మోడీ ఖాతాలో మరొక రికార్డు ..అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన కాంగ్రెస్ యేతర నేతగా సరికొత్త రికార్డు


భారత ప్రధాని నరేంద్ర మోడీ మరొక అరుదైన ఘనతను సాదించాడు ..దేశ ప్రధాన మంత్రిగా అత్యధిక కాలం పని చేసిన కాంగ్రెస్ యేతర వ్యక్తిగా రికార్డు సృష్టించాడు ..ఇంతకుముందు ఈ రికార్డు దిగ్గజ ప్రధాని అటల్ బీహార్ వాజపేయి పేరు మీద ఉంది..వాజపేయి మొత్తంగా తన రాజకీయ ప్రస్థానంలో 2268 రోజులు ప్రధానిగా వ్యవహరించగా మోడీ ఆ రికార్డు ను చెరిపేసాడు..

జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌ల తర్వాత అత్యధిక కాలం ప్రధానిగా వ్యవహరించిన ఘనతను నరేంద్ర మోదీ సొంతం చేసుకున్నారు. మోదీ దేశ 14వ ప్రధానమంత్రిగా 2014 మే 26న ప్రమాణస్వీకారం చేయగా, 2019, మే 30న రెండోసారి కీలక బాధ్యతలను చేపట్టారు.

ఇక భారత దేశానికి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన రికార్డు జవహర్ లాల్ నెహ్రు పేరు మీద ఉంది ..నెహ్రు మొత్తంగా పదిహేడు ఏళ్ళు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు..ఇక ఆ తర్వాత ఇందిరా గాంధీ పదహారు ఏళ్ళు దేశానికి ప్రధానిగా పనిచేసారు..ఇక ఆ తర్వాత మన్మోహన్ సింగ్ వరుసగా రెండు పర్యాయాలు ప్రధానిగా చేసారు..ఇక ఆ తర్వాత ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ వారి తర్వాతి స్థానంలో నిలిచాడు ..

Tags :
|
|
|

Advertisement