Advertisement

  • మోదీ సర్కార్ తీపికబురు... రూ.2 లక్షల కోట్లతో కొత్త స్కీమ్‌...

మోదీ సర్కార్ తీపికబురు... రూ.2 లక్షల కోట్లతో కొత్త స్కీమ్‌...

By: chandrasekar Wed, 11 Nov 2020 9:32 PM

మోదీ సర్కార్ తీపికబురు... రూ.2 లక్షల కోట్లతో కొత్త స్కీమ్‌...


మోదీ సర్కార్ కరోనా వైరస్ దెబ్బకి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రంగాలను ఆదుకోవడానికి ప్రత్యేక స్కీమ్‌ను తీసుకువచ్చింది. దీని పేరు పీఎల్‌ఐ స్కీమ్. కేంద్ర కేబినెట్ ఈ పీఎల్ఐ స్కీమ్‌కు ఆమోదం కూడా తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 10 రంగాలు లక్ష్యంగా ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్‌సె‌న్‌టివ్ స్కీమ్‌ను ఆవిష్కరించింది. కేంద్ర ప్రభుత్వం పీఎల్ఐ స్కీమ్‌కు ఏకంగా రూ.2 లక్షల కోట్లు వరకు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఐదేళ్ల కాలంలో ఈ డబ్బులను ఈ స్కీమ్ కింద పలు రంగాల కోసం ఖర్చు చేయనుంది. అన్ని రంగాల్లోకెల్లా వాహన రంగానికి, వాహన విడిభాగాల రంగానికి అధిక ప్రాధాన్యం లభించింది.

మోదీ సర్కార్ ఈ రంగాల కోసం రూ.57 వేల కోట్లు కేటాయించింది. స్కీమ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అదనంగా తయారు చేసిన ప్రొడక్టులను రాయితీలు అందిస్తుంది. అలాగే వీటిని ఇతర దేశాలకు ఎగమతి కూడా చేయొచ్చు. అడ్వాన్స్ సెల్ కెమిస్ట్ర బ్యాటరీ, ఫార్మాస్యూటికల్స్, ఫుడ్ ప్రొడక్షన్, వైట్ గూడ్స్, టెక్స్‌టైల్, టెలింక అండ్ నెట్‌వర్కింగ్, టెక్నాలజీ ప్రొడక్ట్స్ వంటి రంగాలకు కూడా కేటాయింపులు దక్కాయి. కేంద్ర ప్రభుత్వం 2025 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఎకానమీని లక్ష్యంగా నిర్దేశించుకుంది. దేశంలో ప్రైవేట్ రంగంలో ఇన్వెస్ట్మెంట్లను పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పీఎల్ఐ స్కీమ్ కింద కీలకమైన రంగాలకు ఆర్థిక తోడ్పాటు లభిస్తుందని తెలిపారు. దేశంలోకి ఇన్వెస్ట్‌మెంట్లను ఆకర్షించడం కోసం ఈ ఆర్థిక మద్దుతు అందిస్తున్నామని వివరించారు. వివిధ రంగాలకు చెందిన మంత్రులు, విభాగాలు వెంటనే స్కీమ్స్‌ను అమలు చేస్తాయని పేర్కొన్నారు.

Tags :
|

Advertisement