Advertisement

  • మోదీ ప్రభుత్వం ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్...

మోదీ ప్రభుత్వం ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్...

By: chandrasekar Sat, 17 Oct 2020 6:54 PM

మోదీ ప్రభుత్వం ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్...


దేశ వ్యాప్తంగా ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్యను తెలుసుకోవడానికి మోదీ ప్రభుత్వం కౌంటింగ్ ప్రక్రియ మొదలుపెట్టనుంది దీనిలో భాగంగా ఉద్యోగులు జీతాలను కూడా తెలుసుకోనుంది ప్రభుత్వం. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు సరైన జీతం, సోషల్ సెక్యూరిటీ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సర్వే సమయంలో ప్రొఫెషనల్స్ ఎవరో, ప్రైవేటు ఉద్యోగులు ఎవరో తెలిసిపోతుంది. ఈ బాధ్యతను లేబర్ డిపార్టమెంట్ కు అప్పగించారు.

సర్వే కోసం కమిటీ ఏర్పాటు...

ప్రముఖ ఆర్థికవేత్తలు అయిన ఎస్పీ ముఖర్జీ, అమితాబ్ కుండు అధ్యక్షతన ఒక కమిటీ ఈ సర్వే బాధ్యతలను నిర్వహిస్తుంది. ఈ కమిటీ వలస కార్మికులు, డొమెస్టిక్ వర్కర్స్, ప్రొఫెషనల్స్ గురించి సర్వే చేస్తుంది. అయితే ఇందులో ఇంట్లో వంటావార్పు, స్వీపర్స్ సంఖ్యను కౌంట్ చేయరు అని పేర్కొంది. వీరి కౌంటింగ్ ఎలా ఉండనుంది అనేది అక్టోబర్ 21న జరిగే సమావేశంలో నిర్ణయి౦చబడుతుంది. కార్మిక శాఖ ప్రకారం ప్రస్తుతం చార్టెర్డ్ ఎకౌంటెంట్స్, లాయర్స్, డాక్టర్స్, ఫ్యాషన్ డిజైనర్స్ వంటి ప్రొఫెషనల్స్ డాటా ప్రభుత్వం వద్ద లేదు. వీరి గురించి తెలుసుకోవడానికి కూడా సర్వే ఉపయోగపడుతుంది. వీటి వల్ల వలస కార్మికులకు సౌకర్యాలు కల్పించేందుకు అకాశం ఉంటుందని సమాచారం.

Tags :
|
|

Advertisement