Advertisement

  • హైదరాబాద్‌లో భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలతో మోదీ సమీక్ష ముగిసింది...

హైదరాబాద్‌లో భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలతో మోదీ సమీక్ష ముగిసింది...

By: chandrasekar Sat, 28 Nov 2020 7:58 PM

హైదరాబాద్‌లో భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలతో మోదీ సమీక్ష ముగిసింది...


హైదరాబాద్‌లో మోదీ పర్యటన ముగిసింది. నగరానికి చేరుకున్న ప్రధాని నేరుగా భారత్ బయోటెక్ కంపెనీకి వెళ్లారు. అక్కడ కరోనా వ్యాక్సిన్ తయారీ, ఉత్పత్తి గురించి అక్కడున్న పరిశోధన అధికారులను అడిగి తెలుసుకున్నారు. శాస్త్రవేత్తలతో మాట్లాడి సంస్థ తయారు చేస్తున్న కరోనా‌ వ్యాక్సిన్‌ 'కొవాగ్జిన్‌' వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ తయారీ ఉత్పత్తి గురించి ప్రధానికి శాస్త్రవేత్తలు వివరించారు. మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌కు కోవాగ్జిన్ వ్యాక్సిన్ చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 60శాతం వ్యాక్సిన్ ఉత్పత్తి హైదరాబాద్‌లోనే జరుగుతుంది. సమీక్ష ముగిసిన అనంతరం మోదీ తిరిగి హకీంపేటకు బయల్దరారు.

ముందుగా నగరంలోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు మోదీ హకీంపేట నుంచి పూణె వెళ్లనున్నారు ప్రధాని. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ సోమేశ్‌కుమార్‌, కలెక్టర్‌ శ్వేతా మొహంతితో పాటు పలువురు అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గం ద్వారా జీనోమ్‌వ్యాలీకి చేరుకున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రత దృష్ట్యా రాజీవ్‌ రహదారిపై హైదరాబాద్‌ - కరీంనగర్‌ రూట్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ప్రధాని ఉదయం గుజరాత్‌లోని బైడస్‌ క్యాడిలా సంస్థను ప్రధాని సందర్శించారు. క్యాడిలా సంస్థ తయారు చేస్తున్న 'జైకోవ్‌-డీ' కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తి, పంపిణీకి సంబంధిన ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. హైదరాబాద్ నుంచి ఇప్పుడు పూణెకు బయల్దేరి వెళ్తారు ప్రధాని.

Tags :
|

Advertisement