Advertisement

  • అమెరికా అధ్యక్ష ఎన్నికలకంటే ముందే వ్యాక్సిన్ రిలీజ్ కష్టం ...ట్రంప్ కు షాకిచ్చిన మోడెర్నా

అమెరికా అధ్యక్ష ఎన్నికలకంటే ముందే వ్యాక్సిన్ రిలీజ్ కష్టం ...ట్రంప్ కు షాకిచ్చిన మోడెర్నా

By: Sankar Thu, 01 Oct 2020 6:47 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికలకంటే ముందే వ్యాక్సిన్ రిలీజ్ కష్టం ...ట్రంప్ కు షాకిచ్చిన మోడెర్నా


అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. అమెరికా ఎన్నికలకు ముందే వాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాక్సిన్ వస్తుందని చెప్పడంతో ప్రజలు వాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో వాక్సిన్ తయారీ కంపెనీ మోడెర్నాపై వైట్ హౌస్ నుంచి ఒత్తిడి పెరిగింది. కానీ, మోడెర్నా వాక్సిన్ కంపెనీ మాత్రం ఈ విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం అయ్యింది.

నవంబర్ 25 వ తేదీ వరకు వాక్సిన్ ను రిలీజ్ చేసే అవకాశం లేదని మోడెర్నా సీఈవో స్టీఫెన్ తెలియజేశారు. ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉందని, ట్రయల్స్ ఫలితాలు రావడానికి సమయం పడుతుందని, నవంబర్ 25 వరకు ఫలితాలు రావొచ్చని అన్నారు. అన్ని ట్రయల్స్ ను పూర్తి చేసుకొని సురక్షితం అని కన్ఫర్మ్ చేసుకున్న తరువాతే ఎఫ్.డి.ఏ కు తెలియజేస్తామని అన్నారు. నవంబర్ 25 ముందు వరకు వాక్సిన్ రిలీజ్ కాబోదని అయన స్పష్టం చేశారు..

కాగా ప్రపంచంలో కరోనా బారిన పడిన దేశాలలో అమెరికా అత్యధిక కేసులతో మొదటి స్థానంలో ఉంది ...మరణాలలో కూడా అమెరికా నే మొదటి స్థానంలో ఉంది..అయితే కరోనా నిర్ములనకు ప్రపంచ వ్యాపతంగా జరుగుతున్న వ్యాక్సిన్ ప్రయోగాల్లో మోడర్న కూడా ఒకటి..ఇప్పటికే రష్యా తన వ్యాక్సిన్ ను ప్రకటించగా భారత్ లో క్లినికాల్ట్రయిల్స్ దశలో ఉన్నాయి

Tags :

Advertisement