Advertisement

  • కరోనా తీవ్ర‌మైన కేసుల విష‌యంలో నూరు శాతం ప‌ని చేసిన‌ట్లు మోడెర్నా కంపెనీ వెల్లడి

కరోనా తీవ్ర‌మైన కేసుల విష‌యంలో నూరు శాతం ప‌ని చేసిన‌ట్లు మోడెర్నా కంపెనీ వెల్లడి

By: chandrasekar Tue, 01 Dec 2020 12:02 PM

కరోనా తీవ్ర‌మైన కేసుల విష‌యంలో నూరు శాతం ప‌ని చేసిన‌ట్లు మోడెర్నా కంపెనీ వెల్లడి


ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ హడలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ బారినుండి కాపాడుకొనుటకు పలు కంపెనీలు వాక్సిన్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం త‌మ క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ 100 శాతం స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తోంద‌ని అమెరికా కంపెనీ మోడెర్నా ప్ర‌క‌టించింది. ప్ర‌యోగాల పూర్తి ఫ‌లితాలు ఈ వ్యాక్సిన్ 94.1 శాతం స‌మ‌ర్థ‌వంతంగా ఉన్న‌ట్లు చూపించాయ‌ని, అయితే తీవ్ర‌మైన కేసుల విష‌యంలో ఇది 100 శాతం ప‌ని చేసిన‌ట్లు ఆ మోడెర్నా వెల్ల‌డించింది.

ఈ వాక్సిన్ మంచి ఫలితాలు ఇవ్వడం వల్ల అమెరికా, యూర‌ప్‌ల‌లో త‌మ వ్యాక్సిన్ వాడ‌కానికి క్లియ‌రెన్స్ కోర‌తామ‌ని ఈ కంపెనీ తెలిపింది. వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి ఇవ్వాల్సిందిగా అమెరికా ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎఫ్‌డీఏ)ను కోర‌నున్న‌ట్లు మోడెర్నా ఒక ప్ర‌క‌ట‌న‌లో చెప్పింది. అంతేకాకుండా మార్కెటింగ్ కోసం యురోపియ‌న్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ)కు ద‌ర‌ఖాస్తు చేసుకుంటామ‌ని కూడా తెలిపింది. ఈ వాక్సిన్ అందుబాటులోకి వస్తే వైరస్ వ్యాప్తి కూడా గణనీయంగా తగ్గుతుంది.

Tags :

Advertisement