Advertisement

  • కరోనా వ్యాక్సిన్ పై కీలక ప్రకటన చేసిన మోడెర్న్

కరోనా వ్యాక్సిన్ పై కీలక ప్రకటన చేసిన మోడెర్న్

By: Sankar Mon, 30 Nov 2020 7:14 PM

కరోనా వ్యాక్సిన్ పై కీలక ప్రకటన చేసిన మోడెర్న్


ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఏస్థాయిలో విలయతాండవం చేసిందో అందరికి తెలిసిందే...ఏడాది క్రితం చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా అన్ని దేశాలను పట్టిపీడించింది...అయితే కరోనా నిర్ములనకు చాల దేశాలు వ్యాక్సిన్ తయారీ పనిలో నిమగ్నమయ్యాయి...

అందులో భాగంగా త‌మ క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ 100 శాతం స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తోంద‌ని ప్ర‌క‌టించింది అమెరికా కంపెనీ మోడెర్నా. ప్ర‌యోగాల పూర్తి ఫ‌లితాలు ఈ వ్యాక్సిన్ 94.1 శాతం స‌మ‌ర్థ‌వంతంగా ఉన్న‌ట్లు చూపించాయ‌ని, అయితే తీవ్ర‌మైన కేసుల విష‌యంలో ఇది 100 శాతం ప‌ని చేసిన‌ట్లు ఆ మోడెర్నా వెల్ల‌డించింది. అమెరికా, యూర‌ప్‌ల‌లో త‌మ వ్యాక్సిన్ వాడ‌కానికి క్లియ‌రెన్స్ కోర‌తామ‌ని తెలిపింది.

వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి ఇవ్వాల్సిందిగా అమెరికా ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎఫ్‌డీఏ)ను కోర‌నున్న‌ట్లు మోడెర్నా ఒక ప్ర‌క‌ట‌న‌లో చెప్పింది. అంతేకాకుండా మార్కెటింగ్ కోసం యురోపియ‌న్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ)కు ద‌ర‌ఖాస్తు చేసుకుంటామ‌ని కూడా తెలిపింది

Tags :
|

Advertisement