Advertisement

రాబోయే ఆరు నెలల్లో మొబైల్ సేవల ధరలు పెంపు

By: chandrasekar Wed, 26 Aug 2020 08:55 AM

రాబోయే ఆరు నెలల్లో మొబైల్ సేవల ధరలు పెంపు


రాబోయే ఆరు నెలల్లో మొబైల్ సేవల ధరల పెంచనున్నట్లు తెలిసింది. కరోనా కారణంగా డేటా వాడుక అధికమైన ఈ సమయంలో ఇలాంటి ప్రకటన అందరిని షాక్ కు గురిచేసింది. మొబైల్ సేవల్లో చార్జీలు మరింతగా పెరవచ్చని టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ఈ సంకేతాలను సోమవారం వెల్లడించారు. రాబోయే ఆరు నెలల్లో మొబైల్ సేవల ధరల పెరగనున్నాయంటూ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. తక్కువ రేటుతో డేటా సేవలను అందించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు.

టెలికాం పరిశ్రమ తక్కువ ధరకు డేటా ఇవ్వడం వల్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉందని మిట్టల్ అందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అందిస్తున్న ఆఫర్లలో 160 రూపాయలకే నెలకు 16జీబీ డేటా ఇవ్వడం బాధాకరం అన్నారు. రానున్న రోజుల్లో నెలకు1.6 జీబీ వినియోగానికి అలవాటు పడాలి లేదా ప్రస్తుతం చెల్లిస్తున్న దానికంటే చాలా ఎక్కువ చెల్లించడానికి సిద్ధం కావాల్సిందేనని మిట్టల్ వ్యాఖ్యానించారు. అమెరికా యూరప్ లో లాగా 50-60 డాలర్లు కాకపోయినా, ఖచ్చితంగా నెలకు 160 రూపాయలకు 16జీబీ వినియోగం మాత్రం ఒక విషాదమే అని తేల్చి చెప్పారు.

భారతీ ఎంటర్ ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ అఖిల్ గుప్తా రాసిన పుస్తకం విడుదల సందర్భంగా మిట్టల్ వ్యాఖ్యనిస్తూ రానున్న ఆరు నెలల కాలంలో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్(ఏఆర్‌పీయూ) 200 రూపాయలు దాటొచ్చని అంచనా వేశారు. డేటా కోసం అయితే 100 సరిపోతుంది కానీ టీవీ, మూవీస్, ఎంటర్ టైన్ మెంట్ లాంటి చూడాలంటే మాత్రం వాటికి కస్టమర్ కచ్చితంగా అధికంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. తమకు 300 ఏఆర్పీయూ కావాల్సిందేనని మిట్టల్ పేర్కొన్నారు.

అతను అందించిన వివరాల ప్రకారం ఏఆర్‌పీయూ 60శాతం పెరిగితే మంచిదని. కనీసం 27శాతం పెరగాలి. ప్రస్తుతం ఒక జీబీకి చెల్లిస్తున్న10 రూపాయలకు బదులుగా భవిష్యత్తులో100 రూపాయలు చెల్లించాలి. అలాగే నెలకు 45 రూపాయలు చెల్లిస్తున్న వారు రెట్టింపు కంటే ఎక్కువగా 100 రూపాయలు చెల్లించాలని తెలిపారు. ఇందువల్ల రానున్న రోజుల్లో మరింతగా డేటా కోసం టెలికాం కంపనీలకు చెల్లించుకోవలసి అవసరం ఏర్పడుతుంది.

కరోనా కాలంలో కూడా టెలికాం ఆపరేటర్లు దేశానికి సేవ చేశారని, అలాగే 5జీ, ఆప్టికల్ ఫైబర్స్, సబ్ మెరైన్ కేబుల్స్ లో పెట్టుబడులు పెట్టాల్సి ఉందని మిట్టల్ వెల్లడించారు. కేవలం 2-3 ఆపరేటర్లతో సంక్షోభంలో పడిన పరిశ్రమ స్థిరంగా కొనసాగాలంటే రాబోయే 5-6 నెలల్లో ఖచ్చితంగా 200-250 మార్కును దాటాల్సిందేనని మిట్టల్ వెల్లడించారు. టెలికాం వ్యాపారం డిజిటల్ బాట పట్టాల్సిన అవసరం ఉందన్నారు. కాగా డిసెంబర్ 2019లో టారిఫ్ పెంచిన అనంతరం జూన్ 30 నాటికి తొలి క్వార్టర్ లో ఎయిర్ టెల్ ఏఆర్పీయూ రూ.157కి పెరగడం గమనార్హం. ప్రస్తుతం అన్ని విద్యా కార్యక్రమాలు ఆన్లైన్ లో నిర్వహించడం ద్వారా ఇంటర్నెట్ వాడుక అధికమైంది.

Tags :
|

Advertisement