Advertisement

మిస్సైళ్ల కంటే వేగంగా మొబైల్‌ ఫోన్‌ యాప్‌‌లు

By: chandrasekar Sat, 19 Dec 2020 11:37 AM

మిస్సైళ్ల కంటే వేగంగా మొబైల్‌ ఫోన్‌ యాప్‌‌లు


భద్రత ముప్పు పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరించారు. చండీగఢ్‌లో నిర్వహిచబడ్డ మిలిటరీ లిటరేచర్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్న రాజ్‌నాథ్‌ సింగ్ భద్రత ముప్పు గురించి మాట్లాడారు. మన శత్రువులు దేశ సరిహద్దులను దాటకుండానే మొబైల్‌ ఫోన్ ద్వారా ప్రజలను చేరుకోవచ్చునని అభిప్రాయపడ్డారు. కనుక ప్రతి ఒక్కరూ ఒక సైనికుడి పాత్ర పోషించాలని కోరారు.

ప్రస్తుతం సోషల్‌ మీడియాతో పొంచి ఉన్న ముప్పును గుర్తించి తప్పుడు ప్రచారాల నుంచి మనతోపాటు ఇతరులను కూడా కాపాడుకోవాలని తెలియజేసారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం వల్ల మిస్సైళ్ల కంటే వేగంగా మొబైల్‌ ఫోన్‌ యాప్‌‌లు దూసుకెళ్లగలదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండియా మరియు చైనా సరిహద్దు వివాదాలపై ప్రస్తావించారు. చైనా చర్యలకు మన దేశం చైనా యాప్‌ల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. మన దేశ పౌరుల డేటా వివరాలకు ముప్పు ఏర్పడే కారణంగా అనేక యాప్ లను మనం నిషేదించాము.

Tags :
|
|
|
|
|

Advertisement