Advertisement

  • చెస్ట్ ఆసుపత్రి కేసులో నైతిక బాద్థ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలి ..ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

చెస్ట్ ఆసుపత్రి కేసులో నైతిక బాద్థ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలి ..ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

By: Sankar Tue, 30 June 2020 4:03 PM

చెస్ట్ ఆసుపత్రి కేసులో నైతిక బాద్థ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలి ..ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి



ఎర్రగడ్డ లోని చెస్ట్ హాస్పిటల్లో ఆక్సిజన్ అందక యువకుడు మరణించిన విషయం తెలిసిందే ..అయితే ఆ యువకుడు చనిపోయేముందు సెల్ఫీ వీడియో తీసుకోని ఆక్సిజన్ సరిపోవడం లేదు , ఇక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు అతని యొక్క తండ్రికి ఆ వీడియోను పంపించాడు ..ఆ వీడియో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తున్నాయి ..

తాజాగా ప్రభుత్వ ఆసుప‌త్రిలో ఆక్సిజ‌న్ అందించ‌క‌పోవ‌డం చాలా బాధ‌క‌ర‌మ‌ని ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి విచారం వ్య‌క్తం చేశారు. చెస్ట్ ఆస్ప‌త్రిలో ఆక్సిజ‌న్ ఎందుకు పెట్ట‌లేద‌నే విషయంపై క్లారిటీ ఇవ్వ‌కుండా ఆరోగ్య‌శాఖ మంత్రి సెల్ఫీ విడీయోను త‌ప్పుప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు. ముఖ్య‌మంత్రికి క‌నీస నైతిక బాధ్య‌త ఉంటే రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ వి‌‌‌ష‌యంలో ఇంత వ‌ర‌కు స్పంద‌న లేద‌ని ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. బలవన్మరణానికి పాల్పడిన వారికి సంబంధించి మానవ హక్కుల కమిషన్ సోమోటోగా పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు..

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు జీవించే హక్కు కోల్పోతున్నార‌ని జీవ‌న్‌రెడ్డి పేర్కొన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాల‌న్నారు. దేశంలో ఆయుష్మాన్ భార‌త్‌, ఆరోగ్య శ్రీ పొంద‌టానికి ప్ర‌తి పౌరుడికి హ‌క్కుంద‌ని, ఆయుస్మాన్ భారత్‌ను తక్షణమే రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా సేవల కోసం ప్రైవేట్ హాస్పిటల్‌కు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ధరలు అమలు కావడం లేదని విమ‌ర్శించారు. అన్నింటికీ ఒకే వైద్యం క్వారంటైన్ అనే స్థాయికి ప్రభుత్వం దిగజారిందన్నారు.

Tags :
|
|

Advertisement