Advertisement

  • కరోనా మృతుడి అంత్యక్రియలను దగ్గర ఉండి జరిపించిన ఎమ్యెల్యే

కరోనా మృతుడి అంత్యక్రియలను దగ్గర ఉండి జరిపించిన ఎమ్యెల్యే

By: Sankar Sun, 02 Aug 2020 11:46 AM

కరోనా మృతుడి అంత్యక్రియలను దగ్గర ఉండి జరిపించిన ఎమ్యెల్యే



కరోనా మహమ్మారి కారణంగా ప్రజల మధ్య దూరాలు కూడా బాగా పెరిగిపోయాయి ..కరోనా వచ్చింది అంటే ఇక ఆ వ్యక్తిని కలవడానికి సొంత ఇంట్లో కుటుంబీకులకు కూడా అనుమతి ఉండదు ..ఇక ఒకవేళ కరోనా వలన చనిపోతే మాత్రం అంతే సంగతులు అంత్యక్రియలకు కూడా కుటుంబసబాయులు ముందు రావడానికి జంకుతున్నారు ..అయితే కర్నూలులో మాత్రం కరోనా తో చనిపోయిన ఒక వ్యక్తికి ఎమ్యెల్యే దగ్గర ఉండి అంత్యక్రియలు జరిపించాడు ..

కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులే ముందుకు రాని ప్రస్తుత పరిస్థితుల్లో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ కరోనా కారణంగా మరణించిన ఓ వ్యక్తికి దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు. కర్నూలు పాతబస్తీకి చెందిన వ్యక్తి శుక్రవారం కరోనాతో స్థానిక పెద్దాసుపత్రిలో మృతిచెందాడు. అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాకపోవడంతో ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ స్వయంగా రంగంలోకి దిగారు.

ఆసుపత్రి, మున్సిపల్‌ సిబ్బందితో కలిసి పీపీఈ కిట్లు ధరించి నగరంలోని సంతోష్‌నగర్‌ శ్మశాన వాటికలో శుక్రవారం రాత్రి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపించారు. వైరస్‌పై ప్రజల్లో ఉన్న భయాన్ని, అపోహలను తొలగించేందుకే తాను స్వయంగా అంత్యక్రియల్లో పాలుపంచుకున్నట్లు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ చెప్పారు..

Tags :
|
|
|

Advertisement