Advertisement

  • కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూపాల్రెడ్డి

కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూపాల్రెడ్డి

By: chandrasekar Tue, 25 Aug 2020 5:54 PM

కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూపాల్రెడ్డి


సోమవారం పెద్దశంకరంపేట పట్టణంలోని బాయికాడి పద్మయ్య ఫంక్షన్‌హాల్‌లో మండలంలోని 128 మంది లబ్ధిదారులకు రూ.కోటి 12 లక్షల కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లాడారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. రైతులకు సకాలంలో సహకార సంఘాల ద్వారా ఎరువులను అందజేయడంతోపాటు పండించిన పంటకు గిట్టుబాటు ధరను చెల్లించి కొనుగోలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్‌, జడ్పీటీసీ విజయరామరాజు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఆసూరి మురళీపంతులు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సురేశ్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ లక్ష్మీరమేశ్‌, తహసీల్దార్‌ మనోహర్‌ చక్రవర్తి, ఎంపీడీవో రామ్‌నారాయణ పాల్గొన్నారు.

అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేసినప్పుడే పురోగతి సాధ్యమవుతుందని, ఆ దిశగా అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి సూచించారు. సోమవారం ఖేడ్‌ మున్సిపాలిటీ పనితీరుపై మున్సిపల్‌ అధికారులు, సిబ్బందితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీ రాబడిని పెంచుకునే వనరులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.

పన్నుల వసూళ్ల విషయంలో కఠినంగా ఉండడంతోపాటు పన్నుల వసూలు ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పారిశుధ్యం, వీధిలైట్లు, మంచినీటి వసతి తదితర సౌకర్యాలపై ఎప్పటికప్పుడు శ్రద్ధ వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని తెలిపారు. ఇప్పటికే పట్టణంలో రూ.11కోట్ల నిధులతో కొనసాగుతున్న సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించినట్టు పేర్కొన్నారు. ప్రజావసరాలు తీర్చే విషయంలో చిత్తశుద్ధితో పనిచేయాలని, సమస్యల పరిష్కారం కోసం నిధులు సమీకరించటంలో కృషిచేస్తానన్నారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రుబినాబేగం నజీబ్‌, వైస్‌ చైర్మన్‌ ఆహీర్‌ పరశురామ్‌, ఇన్‌చార్జి కమిషనర్‌ మల్లేశం పాల్గొన్నారు.


Tags :
|

Advertisement