Advertisement

  • ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్‌ అడిగిన హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ

ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్‌ అడిగిన హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ

By: Dimple Mon, 31 Aug 2020 11:48 PM

ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్‌ అడిగిన హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ

రాష్ట్రంలో అభివృద్ధి సన్నగిల్లిందని.. ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులు పెరిగాయని ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. హిందూపురంలో ప్రభుత్వ ఆస్పత్రికి రూ.55లక్షల విలువైన కరోనా నివారణ ఔషధాలు, పరికరాలను అందజేశారు. అనంతరం మీడియాతో బాలకృష్ణ మాట్లాడారు. తాను ఎక్కడున్నా నియోజకవర్గ అభివృద్ధికి శ్రమిస్తానని చెప్పారు. హిందూపురం అభివృద్ధిపై చర్చించేందుకు సీఎం జగన్‌ను ఇప్పటికే రెండుసార్లు అపాయింట్‌మెంట్‌ కోరానని.. మరోసారి సమయం అడిగి సీఎంను కలుస్తానని తెలిపారు.

వివాదాస్పదమైన వ్యాఖ్యలు, ప్రవర్తనతో వార్తల్లో నిలిచే టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి అడ్డంగా బుక్కయ్యారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా ప్రజలకు ఉచిత సలహాలిచ్చి విమర్శలు కొనితెచ్చుకున్నారు. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికైన బాలయ్య 9 నెలలుగా అటువైపు కన్నెత్తైనా చూడలేదు. ఈక్రమంలో ఆయన తీరుపై స్థానికంగా విమర్శలు రావడంతో సోమవారం హిందూపురంలో పర్యటించారు. అయితే, భౌతికదూరం నిబంధనలను పాటించకుండా సమావేశంలో పాల్గొన్నారు.

దాంతోపాటు.. కరోనాకు భయపడొద్దని, వేద మంత్రాలతో కరోనాను ఎదుర్కొందామని చెప్తూ లలిత త్రిపుర సుందరి మంత్రాన్ని చదివి వినిపించారు. కరోనా నివారణ కోసం ఈ మంత్రాన్ని పఠించాలని ప్రజలకు సూచించారు. తాను చెప్పిన మంత్రాన్ని 108 సార్లు చెబితే కరోనా దరిచేరదని బాలకృష్ణ పేర్కొన్నారు. కరోనా బారిన పడకుండా ప్రజలకు జాగ్రత్తలు చెప్పాల్సింది పోయి మంత్రాలు చదవమనడంపై సోషల్‌ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ‘బాలయ్య కరోనా మంత్రం’ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Tags :
|
|

Advertisement